Shreyas Iyer: దులీప్ ట్రోఫీలో విఫలం.. శ్రేయస్ అయ్యర్‌కి టెస్టుల్లో చోటు లేదు
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ జట్టులో లేరు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్‌కి అతన్ని సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అయ్యర్, ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో నాలుగు ఇన్నింగ్స్‌లలో కేవలం 104 పరుగులు మాత్రమే చేసి, విఫలమయ్యారు. గతేడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ వంటి యువ ఆటగాళ్లు ఆకట్టుకోవడంతో, అయ్యర్ వెనుకపడిపోయాడు. దులీప్ ట్రోఫీలో అయ్యర్ ఫామ్‌లో లేకపోవడంతో అతను టెస్టుల్లో పునరాగమనం చేసే అవకాశాలు కనిపించడం లేదు.
శ్రేయస్ అయ్యర్ ఫామ్ లోకి రావాలి
ఈ నేపథ్యంలో బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. ప్రస్తుత టెస్ట్ జట్టులో శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం లేదని తెలిపారు. దులీప్ ట్రోఫీలో అయ్యర్ విఫలమయ్యారని చెప్పారు. ప్రస్తుతం, శ్రేయాస్‌కి టెస్ట్ జట్టులో స్థానం లేదని, అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో తెలియదన్నారు. ఇదిలా ఉండగా మరొక బోర్డు అధికారి అయ్యర్ డొమెస్టిక్ క్రికెట్‌లో కచ్చితంగా రాణించాలని సూచించారు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో కూడా అయ్యర్‌ను ఎంపిక చేసే అవకాశం లేదని పేర్కొన్నారు.