ICC: ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్న నోమన్ అలీ, అమేలియా కెర్
ఐసీసీ అక్టోబర్ నెలకి సంబంధించిన ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు విజేతలను మంగళవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో పాకిస్తాన్ స్పిన్నర్ నోమన్ అలీ, మహిళల విభాగంలో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును సాధించారు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పాక్ జట్టుకు 2-1 విజయాన్ని అందించడంలో నోమన్ అలీ కీలక పాత్ర పోషించాడు. రెండు మ్యాచ్‌ల్లో 13.85 సగటుతో మొత్తం 20 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ విజయం ద్వారా పాకిస్థాన్ జట్టుకు తొమ్మిదేళ్ల తర్వాత ఇంగ్లండ్‌పై సిరీస్ లభించింది. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్‌లను అధిగమించి నోమన్ అలీ ఈ అవార్డును గెలుచుకున్నాడు.
అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది : నోమన్
ఈ అవార్డుకు ఎంపికైనందుకు సంతోషంగా ఉందని, పాకిస్తాన్‌కు ఇంగ్లండ్‌పై చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందించడంలో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందని నోమన్ సంతోషం వ్యక్తం చేశారు. అమేలియా కెర్ 2024 మహిళల టీ20 ప్రపంచకప్‌లో తన ప్రతిభను చూపిస్తూ న్యూజిలాండ్‌ను ఛాంపియన్‌గా నిలిపింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో కెర్ 43 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా, మూడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికైంది. మొత్తం టోర్నమెంట్‌లో ఆమె 15 వికెట్లు సాధించి, ఒకే టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసి సంచలన రికార్డును సృష్టించింది. ఆమె బ్యాటింగ్ విభాగంలో 135 పరుగులు సాధించింది.