Page Loader
PAK vs WI: నోమన్ అలీ హ్యాట్రిక్.. పాకిస్థాన్ తొలి స్పిన్నర్‌గా రికార్డు
నోమన్ అలీ హ్యాట్రిక్.. పాకిస్థాన్ తొలి స్పిన్నర్‌గా రికార్డు

PAK vs WI: నోమన్ అలీ హ్యాట్రిక్.. పాకిస్థాన్ తొలి స్పిన్నర్‌గా రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్‌తో ముల్తాన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ తన స్పిన్ బౌలింగ్‌తో అద్భుతమైన ప్రదర్శన చూపించాడు. అతడు హ్యాట్రిక్ సాధించి పాకిస్థాన్ తరపున ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్‌గా రికార్డులకెక్కాడు. ఇది పాక్ టెస్ట్ క్రికెట్‌లో స్పిన్ బౌలర్ హ్యాట్రిక్ సాధించడం ఇదే తొలిసారి. పాకిస్థాన్ తరపున హ్యాట్రిక్ తీసిన ఐదో బౌలర్‌గా నోమన్ అలీ నిలిచాడు. తన 12వ ఓవర్ లో మూడు వికెట్లను పడగొట్టి ఈ రికార్డు సాధించాడు. తొలి బంతికి జస్టిన్ గ్రీవ్స్ స్లిప్‌లో బాబర్ అజామ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రెండో బంతికి టెవిన్ ఇమ్లాచ్‌ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. మూడో బంతికి కెవిన్ సింక్లెయిర్ స్లిప్‌లో బాబర్ అజామ్‌కు చిక్కాడు.

Details

నాలుగు వికెట్లు తీసిన నోమన్ అలీ

తొలి వికెట్‌గా విండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్‌ను అవుట్ చేసి తన బౌలింగ్ పరఫార్మెన్స్‌ను ప్రారంభించాడు. ఈ మ్యాచ్‌లో నోమన్ అలీ 4 వికెట్లు పడగొట్టి టాప్ బౌలర్‌గా నిలిచాడు. సాజిద్ ఖాన్, అబ్రార్ అహ్మద్ కూడా రాణించడంతో వెస్టిండీస్ 77 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. కెవీమ్ హాడ్జ్ (21), గుడాకేష్ మోతీ (27*) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. మరి మిగిలిన వారు సింగిల్ డిజిట్స్‌లోనే పరిమితమయ్యారు. నోమన్ అలీ 4 వికెట్లు, సాజిద్ ఖాన్ 2 వికెట్లు, కషీఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.