Page Loader
Mohammed Shami:భారత అత్యుత్తమ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా కాదు!.. లెజెండరీ వెస్టిండీస్ పేసర్ ఆండీ రాబర్ట్స్  
భారత అత్యుత్తమ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా కాదు!..

Mohammed Shami:భారత అత్యుత్తమ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా కాదు!.. లెజెండరీ వెస్టిండీస్ పేసర్ ఆండీ రాబర్ట్స్  

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2024
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ పై వెస్టిండీస్ పేసర్ ఆండీ రాబర్ట్స్ ప్రశంసలు కురిపించారు. రాబర్ట్స్, షమిని భారత అత్యుత్తమ బౌలర్ గా చొరవ చూపిస్తున్నాడని పేర్కొంటూ, "షమి కొంతకాలంగా భారత అత్యుత్తమ బౌలర్ గా కొనసాగుతున్నాడు. అతను బుమ్రా ప్రదర్శనతో పోలిస్తే కొంత తక్కువ వికెట్లు పడగొట్టినప్పటికీ, షమి దగ్గర అన్ని రకాల ఆస్త్రాలు ఉన్నాయి. మిగిలిన బౌలర్లతో పోలిస్తే అతని స్థిరత్వం ఎక్కువ. అతను బంతిని స్వింగ్, సీమ్ చేస్తూ, బుమ్రా వంటి బౌలర్ల మాదిరిగా బంతిపై మంచి నియంత్రణను కలిగి ఉంటాడు" అని అభిప్రాయపడ్డాడు.

వివరాలు 

షమి అంతర్జాతీయ పునరాగమనంపై ఇంకా అనిశ్చితి

ఇంకా, షమి స్థాయికి సిరాజ్ చేరలేదని విండీస్ మాజీ పేసర్ ఆండీ రాబర్ట్స్‌ వ్యాఖ్యానించారు. బ్రిస్బేన్ వేదికగా ఆసీస్ తో జరగబోయే మూడో టెస్టులో షమిని ఆడించాలని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ కి సూచించాడు. బుమ్రా 42టెస్టులలో 185వికెట్లు సాధించగా,షమి 64టెస్టుల్లో 229 వికెట్లు పడగొట్టాడు. ఇక, షమి అంతర్జాతీయ పునరాగమనంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతుంది. గాయం కారణంగా సుదీర్ఘకాలం ఆటకు దూరమై,దేశవాళీ క్రికెట్‌లో పునరాగమనంతో మెరుగైన ప్రదర్శనను కనబరుస్తున్న షమి,34ఏళ్ల వయస్సులో ముస్తాక్‌ అలీ టోర్నీలో 16 రోజుల వ్యవధిలో 8 మ్యాచ్‌లు ఆడాడు. అయితే,షమి ఇంకా టెస్టు మ్యాచ్‌ ఫిట్‌నెస్ సాధించలేదని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిట్‌నెస్ సాధించినా,షమిని ఆసీస్‌తో జరగబోయే చివరి రెండు టెస్టుల్లో ఆడించాలని టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నది.