Nuwan Seneviratne: బస్సు డ్రైవర్ నుంచి టీమిండియా త్రోడౌన్ స్పెషలిస్ట్ ఎదిగిన నువాన్ సెనెవిరత్నె
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెటర్లకు సువాన్ సెవెవిరత్నె అంటే ఎవరికి తెలియదు. కానీ అతని వల్లే టీమిండియా బ్యాటర్లు ఎలాంటి తడబాటు లేకుండా పాకిస్థాన్ ప్రమాదకర లెఫ్టార్మ్ పేసర్ షహీన్ షా ఆఫ్రిది బౌలింగ్‌లో పరుగులు చేశారట.
అసలు ఈ సువాన్ సెవెనిరత్నె ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పాకిస్థాన్ మ్యాచులో షాహీన్ షా ఆఫ్రిది బౌలింగ్ లో రోహిత్ శర్మ సిక్సర్ కొట్టగానే కెమెరాలన్నీ భారత డ్రెస్సింగ్ రూం బాల్కనీలో నిల్చుకున్న సువాన్ వైపు ఫోకస్ పెట్టాయి.
అప్పుడు అతనెవరూ అన్నది చాలా మందికి తెలియదు. దీంతో సువాన్ పై చర్చ మొదలైంది.
శ్రీలంకకు చెందిన సువాన్ 2017 నుంచి టీమిండియా జట్టుకు త్రోడౌన్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నాడు.
Details
సువాన్ నైపుణ్యాలను గుర్తించిన టీమిండియా మెనేజ్‌మెంట్
నెట్స్, మైదానంలో ఎడమచేతి వాటంతో నేరుగా త్రోలు విసరడమే సువాన్ పని. అతని కారణంగానే టీమిండియా బ్యాటర్లు లెఫ్టార్మ్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని చెప్పొచ్చు.
43ఏళ్ల సువాన్ క్రికెట్ పై ఇష్టంతో లెఫ్టార్మ్ పేసర్ గా ఎదిగాడు. కేవలం అతను రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచులను మాత్రమే అతను ఆడాడు.
దీంతో పాఠశాల బస్సు డ్రైవర్‌గా పని చేశారు. ఇక 2015లో శ్రీలంక మాజీ బ్యాటర్ చరిత్ సేన నాయకేను కలవడంతో సువాన్ జీవితం మలుపు తిరిగింది.
అనంతరం సువాన్ జట్టు సహాయక బృందంలో చేర్చుకున్నారు. తర్వాత 2017 శ్రీలంక పర్యటనకు భారత జట్టు వెళ్లినప్పుడు సువాన్ నైపుణ్యాలను భారత మెనేజ్‌మెంట్ గుర్తించింది.
దాంతో ఇంటర్వ్యూ నిర్వహించి జట్టు సహాయక బృందంలో చేర్చుకుంది.