Page Loader
Ollie Pope : 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒలి పోప్ సరికొత్త రికార్డు
147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒలి పోప్ సరికొత్త రికార్డు

Ollie Pope : 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒలి పోప్ సరికొత్త రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2024
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ ప్లేయర్ ఒలి పోప్ సరికొత్త రికార్డును సృష్టించారు. శ్రీలంక జరుగుతున్న మూడో టెస్టులో ఈ ఫీట్‌ను సాధించారు. పోప్‌కు ఇది 49వ టెస్టు కాగా, ఇప్పటివరకూ ఏడు సెంచరీలను బాదాడు. క్రికెట్ చరిత్రలో తొలి 7 టెస్ట్ సెంచరీలను 7 వేర్వేరు జట్లపై చేసిన తొలి క్రికెటర్‌గా ఇంగ్లండ్ ప్లేయర్ నిలిచాడు. ఈ సెంచరీలన్నీ ఏడు వేర్వేరు మైదానాల్లో చేయడం విశేషం. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్, పాకిస్థాన్ జట్లపై ఒలి పోప్ శతకాలు నమోదు చేశాడు.