Year Ender 2024: స్పిన్నర్ల మ్యాజిక్.. పేసర్ల పంచ్.. ఈ ఏడాది టాప్-5 బౌలింగ్ స్పెల్స్ ఇవే
టెస్ట్ క్రికెట్‌కు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. వన్డేలు, టీ20ల ప్రభావంతో కొంతకాలం సాగిన లాంగ్ ఫార్మాట్ ఇప్పుడు తిరిగి ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది. దీనికి కారణం, యువ ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శన. బౌలింగ్‌లో ప్రతిభ చూపుతూ, ప్రత్యర్థులను దెబ్బతీస్తూ క్రికెట్ అభిమానులను అలరించారు. ఈ ఏడాది టాప్-5 స్పెల్స్ గురించిఇప్పుడు తెలుసుకుందాం. 1. నోమన్ అలీ (పాకిస్థాన్) పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ అద్భుతమైన ప్రదర్శనతో అందరి మనసును గెలుచుకున్నాడు. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో, నోమన్ తన స్పిన్‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను ధ్వంసం చేశాడు. అతడు 16.3 ఓవర్లలో కేవలం 46 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీశాడు. ఈస్పెల్ ఇంగ్లిష్ బ్యాటర్లను కకావికలం చేసిన స్పెల్‌గా గుర్తుండిపోతుంది.
2. మార్కో యాన్సన్ (సౌతాఫ్రికా)
సౌతాఫ్రికా పేస్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సన్, డర్బన్ వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అదిరిపోయే బౌలింగ్ ప్రదర్శన ఇచ్చాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో అతడు 6.5 ఓవర్లలో కేవలం 13 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసి లంక బ్యాటర్లను చావుదెబ్బ కొట్టాడు. తన లీథల్ పేస్ అటాక్‌తో ప్రత్యర్థులను ఆందోళనకు గురిచేశాడు. 3. అట్కిన్సన్ (ఇంగ్లండ్) ఇంగ్లండ్ యంగ్ సీమర్ అట్కిన్సన్, వెస్టిండీస్‌పై మ్యాజికల్ స్పెల్‌తో చరిత్ర సృష్టించాడు. 12 ఓవర్లలో కేవలం 45 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు. అతడి నిప్పులు చెరిగే బంతులు ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందిపెట్టాయి. ఈ ప్రదర్శన అతడిని టెస్టు క్రికెట్‌లో ఆకర్షణీయ బౌలర్‌గా నిలిపింది.
4. మిచెల్ శాంట్నర్ (న్యూజిలాండ్)
న్యూజిలాండ్ స్టార్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అసాధారణమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. 19.3 ఓవర్లలో 53 పరుగులు మాత్రమే ఇచ్చి 7 కీలక వికెట్లు తీసి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్‌పై శాంట్నర్ దాడి, టెస్టు క్రికెట్‌లో అతడిని మరింత నిలబెట్టింది. 5. వాషింగ్టన్ సుందర్ (భారతదేశం) భారత యువ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అద్భుతమైన స్పెల్ వేసి అదరగొట్టాడు. 23.1 ఓవర్లలో కేవలం 59 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటర్లను గడగడలాడించాడు. అతడి ఆఫ్ స్పిన్ డెలివరీస్ ప్రత్యర్థి బ్యాటర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.