LOADING...
Haider Ali: అత్యాచారం ఆరోపణలపై ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ క్రికెటర్ అరెస్టు.. ఎవరి హైద‌ర్ అలీ ?
అత్యాచారం ఆరోపణలపై ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ క్రికెటర్ అరెస్టు.. ఎవరి హైద‌ర్ అలీ ?

Haider Ali: అత్యాచారం ఆరోపణలపై ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ క్రికెటర్ అరెస్టు.. ఎవరి హైద‌ర్ అలీ ?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 08, 2025
12:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ లో పాకిస్థాన్ యువ క్రికెటర్ హైదర్ అలీని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్-ఏ తరఫున ఇంగ్లాండ్-ఏ జట్టుతో బెకెన్హెయిమ్‌లో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పాల్గొంటున్న అతడు, అత్యాచారం కేసులో ఇరుక్కున్నట్లు సమాచారం. ఈ సంఘటన వెలుగులోకి రాగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హైదర్ అలీపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని బోర్డు ప్రకటించింది. వివరాల ప్రకారం,2025 జూలై 23న 24 ఏళ్ల హైదర్ అలీ తనపై అత్యాచారం జరిపినట్లు ఒక యువతి గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆగస్టు 3న హైదర్ అలీని అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు 

ఇప్పటి వరకు ఒక్క టెస్టు మ్యాచ్‌లోనూ ఆడని హైదర్ అలీ

అనంతరం అతడు బెయిల్‌పై విడుదలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన పీసీబీ, హైదర్ అలీకి అవసరమైన చట్టపరమైన సహాయం అందిస్తామని తెలిపింది. హైదర్ అలీ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.ఇప్పటి వరకు పాకిస్తాన్ తరఫున 2 వన్డేలు,35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 21 సగటుతో మొత్తం 42 పరుగులు చేయగా, టీ20ల్లో 17.4 సగటుతో 505 పరుగులు సాధించాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 27 మ్యాచ్‌లు ఆడి 1,797 పరుగులు చేశాడు. అయితే ఇప్పటి వరకు ఒక్క టెస్టు మ్యాచ్‌లోనూ అతడు ఆడలేదు. హైదర్ అలీ చివరిసారిగా 2023 అక్టోబర్ 6న హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ తరఫున ఆడాడు.