వరల్డ్ కప్ ముందు పాక్ ఫాస్ట్ బౌలర్ కీలక నిర్ణయం.. క్రికెట్‌కు వీడ్కోలు
పాకిస్థాన్ పేసర్ మహబ్ రియాజ్ 2023 వరల్డ్ కప్ ముందు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ పలుకుతున్నట్లు వెల్లడించారు. పాక్ తరుపున 91 వన్డేలు, 36 టీ20లు, 27 టెస్టుల్లో ఆడాడు. ఇన్నాళ్లు పాక్ కు ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన గొప్ప వరమని, తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాక్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు తెలిపారు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రాంఛైజీ క్రికెట్ ఆడుతానని వహాబ్ స్పష్టం చేశారు. వహాజ్ రిజాయ్ రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో పంజాబ్ క్రీడా, యువజన శాఖ మంత్రిగా నియామకమైనట్లు సమాచారం.
వహాబ్ రియాజ్ సాధించిన రికార్డులివే
పాకిస్థాన్ తరుపున 2008లో వహబ్ రియాజ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదే ఏడాది బంగ్లాదేశ్ పై టీ20ల్లో అరంగేట్రం చేశారు. 2020 డిసెంబరులో చివరిసారిగా పాక్ తరుపున ఆడాడు. తన అంతర్జాతీయ మొత్తం 237 వికెట్లను అతను పడగొట్టాడు. వన్డేలోనే 120 వికెట్లు పడగొట్టడం విశేషం. 2011, 2015, 2019 వన్డే వరల్డ్ కప్ లలో పాకిస్తాన్ తరుపున వహాజ్ రియాజ్ ఆడాడు. 2011 ప్రపంచకప్‌లో వహాబ్ ఐదు వికెట్లతో రాణించాడు. మొహాలీలో టీమిండియాతో జరిగిన సెమీ-ఫైనల్‌లో అతను 5/46తో రాణించిన విషయం తెలిసిందే. 2015 ప్రపంచ కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 154.5 kmph వేగంతో బౌలింగ్ వేసి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.