U19 World Cup 2024: ఆస్ట్రేలియాతో సెమీ-ఫైనల్‌లో ఓడిన పాకిస్థాన్.. గ్రౌండ్ లో ఏడ్చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లు!
ఆస్ట్రేలియాతో జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది.దింతో క్రికెటర్లు కన్నీళ్ల పర్యంతమయ్యారు. సెమీఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 179 పరుగులకు ఆలౌటైన పాకిస్థాన్ ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన,పాకిస్థాన్ 179 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో , ఆస్ట్రేలియా తడబడింది. 164 పరుగులకే 9 వికెట్లను కోల్పోయింది. అయితే చివరి వికెట్‌కు రాఫెల్ మాక్‌మిలన్,కల్లమ్ విల్డర్‌ల భాగస్వామ్యం 19 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఇద్దరు బ్యాటర్లు పాకిస్థాన్ వేసిన కఠినమైన బంతులను అద్భుతంగా ఎదుర్కొన్నారు.చివరికి 5 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది.
ఫైనల్ లో భారత్ X ఆసీస్
విన్నింగ్ షాట్‌ను ఆపేందుకు డైవ్ చేసి విఫలమైన పాక్ ఆటగాడు ఉబైద్ షా.. నేలపై అలానే పడుకున్నాడు. సెమీఫైనల్లో పరాజయం ఎదురవ్వడంతో పాక్ ఆటగాళ్లు గ్రౌండ్ లో కన్నీటి పర్యంతమయ్యారు. పాకిస్థాన్ పురుషుల జట్టు డైరెక్టర్‌గా ఉన్న మహమ్మద్ హఫీజ్,సెమీఫైనల్ ఓటమి తర్వాత యువ జట్టును ప్రోత్సహించడానికి ప్రయత్నించాడు. ఆదివారం జరగనున్న తుది పోరులో భారత్‌తో ఆసీస్ అమీతుమీ తేల్చుకోనుంది.