
PAK vs OMAN: పాక్ ఘన విజయం.. ఒమన్‌పై 93 పరుగుల తేడాతో గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ టీ20 టోర్నీలో పాకిస్థాన్ ఘన విజయంతో తన బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ 93 పరుగుల తేడాతో ఒమన్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. తొలి ఓవర్‌లోనే సయిమ్ అయూబ్ (0) వికెట్ కోల్పోయిన పాక్ తరఫున మహ్మద్ హారిస్ (66; 43 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి సాహిబ్‌జాదా ఫర్హాన్ (29), ఫఖార్ జమాన్ (23)లు మద్దతు ఇచ్చారు. ఒమన్ బౌలర్లలో షా ఫైజల్ (3/34), ఆమిర్ కలీమ్ (3/31) బాగా రాణించారు. తరువాత బౌలింగ్‌లో పాక్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు.
Details
ఇవాళ శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్
సయిమ్ అయూబ్ (2/8), సుఫియాన్ ముఖీమ్ (2/7), ఫహీమ్ అష్రాఫ్ (2/6)తో పాటు మరికొందరు బౌలర్లు కూడా సమష్టిగా రాణించడంతో ఒమన్ 16.4 ఓవర్లలో 67 పరుగులకే ఆలౌటైంది. హమ్మద్ మీర్జా (27) జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇది ఒమన్‌కి కూడా టోర్నీలో తొలి మ్యాచ్. ఇక ఆసియా కప్‌లో శనివారం శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తలపడతాయి. లంక జట్టుకు ఇది ఆరంభ పోరుగా ఉండగా, బంగ్లాదేశ్ ఇప్పటికే తన తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌పై విజయం సాధించింది.