LOADING...
Asif Ali: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన పాక్ పవర్ హిట్టర్ 
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన పాక్ పవర్ హిట్టర్

Asif Ali: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన పాక్ పవర్ హిట్టర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2025
02:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ క్రికెట్ జట్టులో పవర్ హిట్టర్‌గానే కాకుండా, ఫినిషర్‌గా కూడా మంచి పేరును సంపాదించిన మిడిలార్డర్ బ్యాటర్ ఆసిఫ్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించాడు. 33 ఏళ్ల ఆసిఫ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని నిన్న సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దేశవాళీ మ్యాచ్‌లు,ఫ్రాంచైజీ లీగ్‌లలో మాత్రం తాను ఆడడం కొనసాగిస్తానని స్పష్టంగా తెలియజేశాడు. ఈ సందర్భంగా ఆసిఫ్ అలీ తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ చేశారు.

వివరాలు 

సోషల్ మీడియా ద్వారా రిటైర్మెంట్ ప్రకటన 

"నేడు నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అవుతున్నాను. పాకిస్థాన్ జెర్సీ ధరించడం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవం. నా దేశం తరఫున మైదానంలో ఆడటం నాకు ఎప్పటికీ గర్వకారణం. కృతజ్ఞతాభావంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. ఇకపై దేశవాళీ, లీగ్ మ్యాచ్‌లలో పాల్గొంటూ నా ఆటపై ఉన్న ఆసక్తిని కొనసాగిస్తాను" అని పేర్కొన్నారు. 2018లో పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆసిఫ్ అలీ,తన కెరీర్‌లో 21 వన్డేలు,58 టీ20లు ఆడాడు. ఈ రెండు ఫార్మాట్లలో కలిపి 959 పరుగులు సాధించాడు. ముఖ్యంగా అతని అగ్రెసివ్ బ్యాటింగ్‌తో జట్టుకు గుర్తుండిపోయే విజయాలు అందించాడు. వన్డేలలో 121.65 స్ట్రైక్ రేట్, టీ20ల్లో 133.87 స్ట్రైక్ రేట్ నమోదు చేయడం అతని హిట్టింగ్ శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది.

వివరాలు 

భారత్‌, ఆఫ్ఘనిస్థాన్‌పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌లు ప్రత్యేకం 

ఆసిఫ్ అలీ కెరీర్‌లో కొన్ని ఇన్నింగ్స్‌లు అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేనివిగా నిలిచాయి. ముఖ్యంగా 2021 టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై మ్యాచ్‌లో పాక్‌కు 12 బంతుల్లో 24 పరుగులు అవసరమైన క్షణంలో కరీమ్ జనత్ వేసిన ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది,కేవలం 7 బంతుల్లోనే 25 పరుగులు చేసి పాకిస్థాన్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. అలాగే 2022 ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన కీలక పోరులో 182పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 8 బంతుల్లో 16 పరుగులు చేసి జట్టు గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ఫైనల్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి ఇస్లామాబాద్ యునైటెడ్‌ను విజయం దిశగా నడిపిన తర్వాతే ఆసిఫ్ అలీ వెలుగులోకి వచ్చాడు.

వివరాలు 

2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో  మ్యాచే చివరి ప్రధాన మ్యాచ్

ఆ అద్భుత ప్రదర్శనతోనే అతనికి జాతీయ జట్టులో స్థానం లభించింది. అయితే తరచూ అవకాశాలు దక్కకపోవడంతో అతని ప్రతిభకు పూర్తిస్థాయి న్యాయం జరగలేదని పలువురు నిపుణులు విశ్లేషించారు. 2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచే పాకిస్థాన్ తరఫున అతను ఆడిన చివరి ప్రధాన మ్యాచ్.