Kamran Akmal: పాక్ జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అర్హత లేదు: కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
స్వదేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ నిరాశాజనకంగా ప్రారంభించింది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఈ ఓటమిపై పాక్ మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ అయితే మరో అడుగు ముందుకేసి, జింబాబ్వే-ఐర్లాండ్ జట్లతో సిరీస్‌లను ఆడుకుని, అక్కడ విజయం సాధించిన తర్వాతే ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీ చేయాలని సూచించాడు.
కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్‌పై కూడా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు.
Details
పాక్ జట్టు ట్రోఫీ నుంచి తప్పుకోవాలి
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్థాన్ జట్టు వైదొలగి, జింబాబ్వే, ఐర్లాండ్‌ల మధ్య జరుగుతున్న సిరీస్‌లో పాల్గొనాలన్నారు.
అందులో గెలిస్తేనే తమ జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీ చేసేందుకు అర్హత ఉందన్నారు.
తమ జట్టు ప్రదర్శన గత ఆరేళ్లుగా చాలా దెబ్బతిన్నాయని అక్మల్ మండిపడ్డారు.
Details
కివీస్‌ను చూసి నేర్చుకోవాలి
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. మూడు వికెట్లు కోల్పోయినా స్ట్రైక్‌ను రొటేట్ చేస్తూ స్కోరు పెంచింది.
ఆటను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నాక దూకుడు పెంచారు. ఇదే పరిపక్వ జట్టు లక్షణం. కనీసం కివీస్‌ను చూసైనా పాకిస్థాన్ జట్టు నేర్చుకోవాలి.
విల్ యంగ్, టామ్ లేథమ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీలు సాధించారని అక్మల్ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ పాకిస్థాన్‌కు 320 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
అయితే ఛేజింగ్‌లో పాక్ జట్టు తడబడింది. కివీస్ బౌలర్ల ధాటికి పాకిస్థాన్ 260 పరుగులకే పరిమితమైంది.