టెస్టు సిరీస్‌లో శ్రీలంకతో తలపడనున్న పాకిస్థాన్.. ఈ ఆటగాళ్లపై భారీ అంచనాలు
శ్రీలంక-పాకిస్థాన్ మధ్య రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ జులై 16 నుంచి ప్రారంభ కానుంది. ఈ సిరీస్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. మొదటి టెస్టు జులై 16న గాలే ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. కొలంబోలోని సింఘాలీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో జులై 24 నుంచి రెండో టెస్టు మ్యాచ్ మొదలు కానుంది. ఇప్పటికే బాబార్ ఆజం బృందం శ్రీలంకకు చేరుకుంది. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు ఉండటంతో రెండు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే ఈ ఏడాది మంచి జోరుమీద ఉన్నారు. ఇప్పటికే అతన్ని లెఫ్ట్ఆర్మ్ స్పీడ్ స్టార్ షాహీన్ ఆఫ్రిది రెండుసార్లు ఔట్ చేశాడు. అఫ్రిది 99 టెస్టు వికెట్లలో 88 వికెట్లను పడగొట్టాడు.
అద్భుత ఫామ్ లో సర్ఫరాజ్ అహ్మద్
ఏంజెలో మాథ్యూస్ పాకిస్థాన్ స్పిన్నర్లకు ధీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాకిస్థాన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్ బౌలింగ్‌లో మాథ్యూస్ పరుగులకు రాబడితే ఆ జట్టు మరింత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. 92 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో మాథ్యూస్ 27 సార్లు ఎడమచేతి వాటం స్పిన్నర్ల చేతిలో ఔట్ అయ్యాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం గతేడాది శ్రీలంకపై 271 పరుగులు చేశాడు. శ్రీలంక స్పిన్నర్ ప్రబాత్ జయసూర్య బౌలింగ్‌లో బాబర్ఆజం మూడుసార్లు ఔట్ య్యాడు. జయసూర్య బౌలింగ్ లో బాబార్ ఆజం ఏ విధంగా రాణిస్తాడో వేచిచూడాలి తన చివరి నాలుగు టెస్టుల్లో సర్ఫరాజ్అహ్మద్ పాకిస్థాన్ తరుపున అద్భుతంగా రాణించాడు. శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ మెండిస్, సర్ఫరాజ్ ఆహ్మద్ ను కట్టడి చేయాలని భావిస్తున్నాడు