Page Loader
Pant- Gill: సెంచరీలతో అదరగొట్టిన పంత్, గిల్
సెంచరీలతో అదరగొట్టిన పంత్, గిల్

Pant- Gill: సెంచరీలతో అదరగొట్టిన పంత్, గిల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2024
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు దిశగా ముందుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశ పరిచిన తర్వాత గిల్ తన ఐదో టెస్టు సెంచరీని సాధించారు. మూడో ఓవర్‌లో రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్, విరాట్ కోహ్లితో కలిసి 39 పరుగులు జోడించారు. తరువాత రిషబ్ పంత్‌తో 150-ప్లస్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.

Details

బంగ్లాదేశ్ పై రెండో సెంచరీ సాధించిన గిల్

గిల్ 3వ స్థానంలో వచ్చి జట్టుకు విలువైన పరుగులకు అందించాడు. గత ఎనిమిది ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు సాధించిన గిల్, ఈ ఏడాది 50-ప్లస్ సగటుతో 600 టెస్ట్ పరుగులను పూర్తి చేశాడు. ఇది బంగ్లాదేశ్‌పై గిల్‌కు రెండవ టెస్టు సెంచరీగా నిలిచింది. రిషబ్ పంత్ 109 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 279/4 స్కోరు చేసింది. క్రీజులో గిల్(112*), కేఎల్ రాహుల్ (21*) ఉన్నారు.