Loading...
Pat Cummins: భార్యతో గొడవపై పాట్ కమిన్స్ క్లారిటీ.. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు!
భార్యతో గొడవపై పాట్ కమిన్స్ క్లారిటీ.. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు!

Pat Cummins: భార్యతో గొడవపై పాట్ కమిన్స్ క్లారిటీ.. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2026
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) తన భార్యతో గొడవ పడినట్లు వచ్చిన వార్తలను ఖండించాడు. తమ వ్యక్తిగత జీవితంలోకి మీడియా చొరబడుతోందని విమర్శించాడు. ఆసీస్ మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా రాసిన పుస్తకం నేపథ్యంలో సిడ్నీలోని తన ఇంటి బయట భార్య బెక్కీతో కమిన్స్ గొడవకు దిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రచారంపై తాజాగా ఆయన స్పందించాడు.

వివరాలు

మీడియా మా కుటుంబాన్ని వెంటాడుతోంది: కమిన్స్

ఈ వివాదంపై పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. "బెక్కీ తన మనసులో ఉన్నది ఉన్నట్లు బయటపెడుతుంది. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన అంశం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం విడ్డూరంగా ఉంది కదా. ఏడాది వయసున్న నా కూతురితో బయట నడుస్తుంటే కెమెరాలు నన్ను, నా కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. నా వరకు ఈ విషయం హాస్యాస్పదంగానే ఉంది. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఉస్మాన్ వ్యవహారంతో బెక్కీ తీవ్ర అసహనంతో ఉంది. ఆమె ఏమాత్రం సంతోషంగా లేదు. ఎప్పుడూ నిజాయతీగా ఉండాలని ఆమె చెబుతుంది. ఆ పర్యటన కంటే చాలా కాలం ముందే బెక్కీ నా జీవితంలోకి వచ్చింది. ప్రతి విషయాన్నీ ఆమె దగ్గరుండి చూసింది.

వివరాలు

కమిన్స్‌కు జస్టిన్ లాంగర్ మద్దతు

జట్టులో ప్రతి ఒక్కరూ బాధపడుతుండటంతో నా భావోద్వేగాలను బయటపెట్టాలని ఆమె కోరిందని కమిన్స్ వివరించాడు.

ఈ వారం ఆస్ట్రేలియాలో నేషనల్ రీసైక్లింగ్ వీక్ జరుగుతున్న నేపథ్యంలో తాను ఇంటి బయట ఆ పనులు చేసుకుంటున్నట్లు కూడా వెల్లడించాడు.

మరోవైపు శాండ్‌పేపర్ గేట్ వివాదం తర్వాత ఆస్ట్రేలియా జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన జస్టిన్ లాంగర్ ఈ వ్యవహారంపై స్పందించాడు.

కమిన్స్‌కు మద్దతుగా నిలిచాడు. ఈ వివాదానికి ఎక్కడో ఒకచోట ముగింపు పలికి ముందుకు సాగాలని అభిప్రాయపడ్డాడు.

ADVERTISEMENT

వివరాలు

ఖవాజాపై తప్పు నెట్టేశారు: డేవిడ్ వార్నర్

ఉస్మాన్ ఖవాజాకు మద్దతుగా ఆసీస్ మాజీ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner) మరోసారి గళం విప్పాడు. ఈ వివాదంలో జరిగిన తప్పును పూర్తిగా ఖవాజాపైనే కమిన్స్ నెట్టేశాడని ఆరోపించాడు.

2018 బాల్ ట్యాంపరింగ్ వివాదంపై ఉస్మాన్ తన పుస్తకంలో రాసిన అంశాలన్నీ వాస్తవమేనని పేర్కొన్నాడు. ఈ విషయంలో కమిన్స్ వ్యవహరించిన తీరు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని వార్నర్ తెలిపాడు.

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో దోషులుగా తేలిన ముగ్గురు ఆటగాళ్లు భారీ మూల్యం చెల్లించుకున్నారని గుర్తుచేశాడు.

ఆ ఘటనకు సంబంధించిన బాధను తాము జీవితాంతం అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

ADVERTISEMENT