Champions Trophy: ఒకసారి ICC చైర్మన్ గా జేషా బాధ్యతలు స్వీకరిస్తే..: ఛాంపియన్స్ ట్రోఫీ డెడ్‌లాక్‌పై పీసీబీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
డిసెంబర్ 1న భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి జైషా (Jay Shah) ఐసీసీ (ICC) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇక, ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, ఐసీసీ పాక్‌కు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే.
శుక్రవారం జరగనున్న సమావేశంలో ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తాజా సమాచారం ప్రకారం,హైబ్రిడ్ మోడల్ కాకుండా టోర్నీ మొత్తాన్ని పాక్ నుంచి తీసేసేందుకు ఐసీసీ చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కాగా, పీసీబీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రోఫీ నిర్వహణను వదులుకొనేదే లేదని స్పష్టంగా చెప్పింది.
వివరాలు
మా ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము నిర్ణయాలు తీసుకుంటాం: మోసిన్ నక్వీ
ఈ క్రమంలో, కొత్త ఐసీసీ ఛైర్మన్‌గా జైషా బాధ్యతలు స్వీకరించిన తరువాత పాకిస్థాన్‌లో టోర్నీ నిర్వహణకు ఆసక్తి తగ్గిపోతుందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అయితే, పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నక్వీ విభిన్నంగా స్పందించారు.
ఆయన మాట్లాడుతూ,''పాకిస్థాన్ నుండి అద్భుతమైన ఆతిథ్యం అందించడానికి మేము సిద్ధం ఉన్నాము. కానీ, భారత జట్టు మా దేశానికి రావడానికి సిద్ధంగా లేదు.అలాగే, మేము కూడా భారత్‌కు వెళ్లే ఆలోచన ఏమి చేయడం లేదు. రేపు జరిగే సమావేశంలో టోర్నీ అంశంపై నిర్ణయం తీసుకోవచ్చు. అయినప్పటికీ, మా ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము నిర్ణయాలు తీసుకుంటాం. డిసెంబర్ 1 నుంచి జైషా ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు.కనుక,ఐసీసీ ప్రయోజనాలు పరిగణనలోకి తీసుకుంటూ జైషా వ్యవహరించాల్సి ఉంటుంది''అన్నారు.
వివరాలు
పాక్ పై మరింత ఒత్తిడి
ఇటీవల, పాక్ క్రికెట్ బోర్డు భారత జట్టుకు సంబంధించి తీవ్ర అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, ''వారు ఇక్కడ రాకపోవడం ఆమోదయోగ్యం కాదు. సమానత్వం ఉండాలి'' అని చెప్పారు.
ఇదిలా ఉంటే, పాక్ కి ఎలాంటి సమస్యలు ఎదురైనప్పటికీ, శ్రీలంక కూడా తమ పర్యటనను విరమించుకోవడం, తద్వారా పాక్ పై మరింత ఒత్తిడి పెరిగింది.
దీంతో, ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక మార్పు జరిగే అవకాశాలు పెరిగాయని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.