LOADING...
IPL Cricket: ఐపీఎల్ మ్యాచ్: జైపూర్ మ్యాచ్​ లో పిచ్ మధ్యలోకి వచ్చిన కోహ్లీ అభిమాని
పిచ్​ మధ్యలోకి వచ్చిన అభిమాని

IPL Cricket: ఐపీఎల్ మ్యాచ్: జైపూర్ మ్యాచ్​ లో పిచ్ మధ్యలోకి వచ్చిన కోహ్లీ అభిమాని

వ్రాసిన వారు Stalin
Apr 07, 2024
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో క్రికెట్ అభిమానులు గ్రౌండ్లోకి రావడం సర్వసాధారణమైపోయింది. శనివారం రాత్రి జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ కి మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ అభిమాని కోహ్లీ జెర్సీ ధరించి స్టేడియంలో ఉన్న భద్రతా సిబ్బంది కళ్లుగప్పి పిచ్ మధ్యలోకి వచ్చేశాడు. రావడమే కాకుండా విరాట్ కోహ్లీని కలిసేందుకు తీవ్రం ప్రయత్నించాడు. ఆ క్రికెట్ అభిమాని ఫెన్సింగ్​ దూకి మైదానంలోకి పరుగెత్తుకుంటూ రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని నిలువరించారు. ఆ సమయంలో రాజస్థాన్‌ రాయల్స్ జట్టు పై ఆర్సీబీ 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్​ లో సెంచరీ సాధించినప్పటికీ ఆర్సీబీ తల రాత మాత్రం మారలేదు.

Virat Kohli

విరాట్​ కోహ్లీ అజేయ సెంచరీ...

ఈ మ్యాచ్లో కోహ్లి కేవలం 72 బంతుల్లోనే 113 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సంజూ శాంసన్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా 184 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆర్ ఆర్ జట్టు ఆటగాడు జోస్ బట్లర్ అజేయ సెంచరీ చేసి ఆర్సీబీ జట్టు గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని 2 జట్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

IPL Match

రోహిత్​ శర్మను కౌగిలించుకున్న అభిమాని

అదేవిధంగా సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబై తో తలపడిన మ్యాచ్​లో కూడా ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. అతడు మైదానంలోకి వచ్చి ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మను కౌగిలించుకున్నాడు. ఊహించని పరిణామంతో ఖంగుతిన్న రోహిత్ శర్మ తనను కౌగిలించుకోవడంపై ఆశ్చర్యపోయాడు. ఇక గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేముందుకు ఇషాన్ కిషాన్ ను కూడా క్రికెట్ అభిమాని కౌగిలించుకున్నాడు.