Page Loader
IPL 2025: ప్లేఆఫ్స్ రేసు.. ఎవరు ముందో, వెనుకో తెలుసా?
ప్లేఆఫ్స్ రేసు.. ఎవరు ముందో, వెనుకో తెలుసా?

IPL 2025: ప్లేఆఫ్స్ రేసు.. ఎవరు ముందో, వెనుకో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 30, 2025
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో మంగళవారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR), దిల్లీ క్యాపిటల్స్‌పై 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఫలితంతో ప్లేఆఫ్స్‌ సమీకరణాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే కొన్ని జట్లు తమ దూకుడుతో టాప్‌ 4లో స్థానం దిశగా ప్రయాణిస్తుండగా, మరికొన్ని జట్లు సెకండ్‌ హాఫ్‌ మ్యాచ్‌లపై ఆధారపడాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పటి వరకు టీమ్‌ల పరిస్థితిని ఓసారి పరిశీలిద్దాం.

Details

టాప్‌లో ఆర్సీబీ దూకుడు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ఇప్పటికే 10 మ్యాచుల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో కనీసం రెండు గెలిస్తే టాప్‌ 4లో స్థానం దాదాపుగా ఖాయమే. రజత్‌ పటీదార్‌ నాయకత్వంలోని ఆర్సీబీ ప్లేఆఫ్స్‌ బెర్త్‌ కోసం ఒక అడుగు దూరంలో ఉంది. ముంబయి ఇండియన్స్‌కు ప్లేఆఫ్స్‌కు చేరువ ముంబయి ఇండియన్స్‌ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 6 విజయాలతో 12 పాయింట్లు పొందింది. హార్దిక్‌ పాండ్య సారథ్యంలో వరుసగా ఐదు విజయాలతో జట్టు ఫామ్‌లో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో కనీసం మూడు గెలిస్తే టాప్‌ 4లో నిలుస్తుంది. రెండు విజయాలతోనూ ప్లేఆఫ్స్‌ ఆశలు నిలిపే అవకాశం ఉంది.

Details

గుజరాత్‌ టైటాన్స్‌కి సులభ మార్గం

గుజరాత్‌ టైటాన్స్‌ 9 మ్యాచుల్లో 6 విజయాలతో 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మిగిలిన ఐదు మ్యాచుల్లో కనీసం రెండు గెలిస్తే ప్లేఆఫ్స్‌ రేసులో నిలవచ్చు. శుభ్‌మన్‌ గిల్‌ నాయకత్వంలో జట్టు మూడు గెలిస్తే టాప్‌ 4లో పక్కా స్థానం దక్కుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ 10 మ్యాచుల్లో 6 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్‌ నాలుగో స్థానంలో ఉంది. అయితే గత 6 మ్యాచ్‌లలో నాలుగు ఓటములతో జట్టు వెనకబడింది. అక్షర్‌ పటేల్‌ నాయకత్వంలో దిల్లీ మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో కనీసం రెండు గెలిస్తే ప్లేఆఫ్స్‌ రేసులో మిగలవచ్చు.

Details

పంజాబ్‌ కింగ్స్‌ - రెండు లేదా మూడు గెలిస్తే చాలు

9 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌ కింగ్స్‌ 5 విజయాలతో 11 పాయింట్లతో అయిదో స్థానంలో ఉంది. వర్షార్పణ కారణంగా కోల్‌కతాతో మ్యాచ్‌ పూర్తి కాలేదు. మరో ఐదు మ్యాచ్‌లలో కనీసం మూడు గెలిస్తే టాప్‌ 4 అవకాశం మెరుగవుతుంది. రెండు విజయాలతోనూ అవకాశాలను కొట్టిపారేయలేం. లఖ్‌నవూ - గట్టిగా ఆడితేనే అవకాశం లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఇప్పటివరకు 10 మ్యాచుల్లో 5 విజయాలు సాధించింది. ఇంకా నాలుగు మ్యాచుల్లో కనీసం మూడింటిలో గెలిస్తే టాప్‌ 4లోకి రావచ్చు. రిషబ్ పంత్‌ ఆశించిన స్థాయిలో ప్రదర్శించకపోయినా, అవకాశాలు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదు.

Details

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

కేవలం 4 విజయాలతో కోల్‌కతా 10 మ్యాచ్‌ల తర్వాత బాగా వెనుకబడింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం మూడింటిలో గెలిస్తేనే ప్లేఆఫ్స్‌ అవకాశాలు తలుపు తట్టవచ్చు. రాజస్థాన్‌ రాయల్స్‌ - ఇతర జట్లపై ఆధారపడాల్సిందే! రాజస్థాన్‌కి మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలిస్తే 14 పాయింట్లకు చేరుతుంది. అయితే ఈ పాయింట్లు సరిపోవడం కష్టం. టాప్‌ 4లోకి రావాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది.

Details

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ - అయిదూ గెలిస్తేనే గేమ్‌!

ఐదు మ్యాచ్‌లు మిగిలిన హైదరాబాద్‌ జట్టు వాటిని అన్నింటినీ గెలిస్తే తప్ప ప్లేఆఫ్స్‌ ఆశలు నెరవేరవు. ఇప్పటి వరకు పేలవంగా ఆడిన సన్‌రైజర్స్‌ మిగిలిన మ్యాచుల్లో చుట్టుపక్కల జట్లపై ఆధారపడకుండా పోటీ చెన్నైకి అద్భుతం మాత్రమే చివరి ఆశ 9 మ్యాచుల్లో కేవలం 2 విజయాలతో చైన్నై సూపర్‌ కింగ్స్‌ చివరిస్థానానికి చేరింది. ఇంకా ఐదు మ్యాచులు మిగిలి ఉన్నప్పటికీ అన్నింటినీ గెలిచినా ప్లేఆఫ్స్‌ చేరడం చాలా కష్టమే. టాప్‌ 4 ఆశలకు ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప చేరే మార్గం లేదు.