
World Record : పూరన్ సిక్సర్ల సునామీ.. టీ20 క్రికెట్‌లో 500 సిక్సర్ల మైలురాయి!
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో టీ20 క్రికెట్ చరిత్రలో అపూర్వ ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో 500 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా నిలిచి, తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 29 ఏళ్ల పూరన్ ఈ రికార్డుతో క్రికెట్ అభిమానులు, నిపుణుల ప్రశంసలు అందుకుంటున్నాడు. రాబోయే తరానికి కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.
Details
CPL 2025లో మైలురాయి
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2025లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కెప్టెన్‌గా బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్ ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్‌లో 65 పరుగులు చేసి, తన ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు బాదాడు. దీంతో అతని కెరీర్ సిక్సర్ల సంఖ్య 500 మార్క్‌ను దాటింది. 2020 నుంచి పూరన్ బ్యాటింగ్‌లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 2020లో 48, 2021లో 66, 2022లో 58, 2023లో 77, 2024లో ఏకంగా 170 సిక్సర్లు బాదాడు. ఇక CPL 2025లో మాత్రమే 42 ఇన్నింగ్స్‌ల్లో 85 సిక్సర్లు కొట్టి తన విధ్వంసకర ఫామ్‌ను మరోసారి నిరూపించాడు.
Details
గేల్ - పొలార్డ్‌ల తర్వాత మూడో స్థానంలో పూరన్
ఈ అద్భుత ప్రపంచ రికార్డుతో పూరన్, అత్యధిక టీ20 సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వెస్టిండీస్ లెజెండ్స్ క్రిస్ గేల్ (920), కీరన్ పొలార్డ్ (614) తర్వాత ఇప్పుడు పూరన్ (504*) మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటికే బ్రెండన్ మెక్‌కల్లమ్ (408), ఆండ్రీ రస్సెల్ (403) లాంటి దిగ్గజాలను దాటేశాడు. 29 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇదే ఫామ్ కొనసాగితే రాబోయే రోజుల్లో గేల్, పొలార్డ్ రికార్డులూ బద్దలు కొట్టే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Details
టాప్ టీ20 సిక్సర్ హిట్టర్స్
క్రిస్ గేల్ - 920 (363 ఇన్నింగ్స్‌లు) కీరన్ పొలార్డ్ - 614 (427 ఇన్నింగ్స్‌లు) నికోలస్ పూరన్ - 504* (278 ఇన్నింగ్స్‌లు) బ్రెండన్ మెక్‌కల్లమ్ - 408 (297 ఇన్నింగ్స్‌లు) ఆండ్రీ రస్సెల్ - 403 (263 ఇన్నింగ్స్‌లు)