LOADING...
Prabhsimran Singh: ఐపీఎల్‌లో ప్రభ్‌సిమ్రన్ రికార్డ్.. రాజస్థాన్‌పై 44 బంతుల్లో 59 పరుగులు
ఐపీఎల్‌లో ప్రభ్‌సిమ్రన్ రికార్డ్.. రాజస్థాన్‌పై 44 బంతుల్లో 59 పరుగులు

Prabhsimran Singh: ఐపీఎల్‌లో ప్రభ్‌సిమ్రన్ రికార్డ్.. రాజస్థాన్‌పై 44 బంతుల్లో 59 పరుగులు

వ్రాసిన వారు Moogati Shabari
Apr 28, 2026
10:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఈ ఐపీఎల్ సీజన్‌లో అదిరే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా జరిగిన మ్యాచ్ 40లో రాజస్థాన్ రాయల్స్‌పై ప్రభ్‌ సిమ్రన్ 44 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సందర్భంగా ప్రియాంశ్ ఆర్యా, కూపర్ కానోలీ, శ్రేయస్ అయ్యర్‌లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ముఖ్యంగా, గత ఐదు ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో ప్రభ్‌సిమ్రన్ నాలుగోసారి 50కి పైగా స్కోర్ నమోదు చేశాడు.

వివరాలు

బౌలర్లపై దాడి చేశారిలా..

ఇన్నింగ్స్ ఆరంభంలో ప్రభ్‌సిమ్రన్ కాస్త జాగ్రత్తగా ఆడాడు. మరో ఎండ్‌లో ప్రియాంశ్ ఆర్యా రాజస్థాన్ బౌలర్లపై దాడికి దిగాడు. ఒక దశలో ప్రభ్‌సిమ్రన్ 12 బంతుల్లో 15 పరుగులతో ఉన్నాడు. అయితే వికెట్‌ను కాపాడుకుంటూ నిలకడగా ఆడిన అతడు, మరో ఎండ్‌లో ఆర్యా, తర్వాత కూపర్ కానోలీ వేగంగా పరుగులు సాధించడంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 11వ ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన ప్రభ్‌సిమ్రన్ గేర్ మార్చాడు. ఆ తర్వాతి ఓవర్‌లో 35 బంతుల్లో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

వివరాలు

ఐపీఎల్ రికార్డులివే..

తర్వాత శ్రేయస్ అయ్యర్ అతనికి జతకాగా, 14వ ఓవర్‌లో యశ్ రాజ్ పుంజా బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ ఔటయ్యాడు. వేగంగా ఆడే ప్రయత్నంలో షాట్ ఆడిన అతడు 44 బంతుల్లో 59 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. క్రిక్‌బజ్ గణాంకాల ప్రకారం, ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రభ్‌సిమ్రన్ ఇప్పుడు మూడో స్థానానికి చేరుకున్నాడు. అతని ఖాతాలో మొత్తం 12 సార్లు 50కి పైగా స్కోర్లు ఉన్నాయి. దీంతో క్రిస్ గేల్ (11)ను అధిగమించాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ (21), షాన్ మార్ష్ (25) ముందున్నారు.

Advertisement

వివరాలు

రికార్డుల మోత..

ఈ సీజన్‌లో ప్రభ్‌సిమ్రన్ స్కోర్లు 37, 43, 51, 80 నాటౌట్, 0, 76గా ఉన్నాయి. 2019లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి బ్యాటర్ ఇప్పటివరకు 59 మ్యాచ్‌ల్లో 1,569 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్‌రేట్ 156.93గా ఉంది. మొత్తం ఒక సెంచరీ, 11 అర్ధశతకాలు నమోదు చేశాడు. ఈ సీజన్‌లోనే ఇప్పటికే నాలుగు హాఫ్ సెంచరీలు బాదాడు.

Advertisement