ODI: వన్డే బౌలింగ్ చరిత్రలో బద్దలైన రికార్డులివే
వన్డే చరిత్రలో ఇప్పటివరకూ బౌలింగ్‌లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. చాలామంది బౌలర్లు ఎన్నో ప్రపంచ రికార్డులను వన్డేల్లో సృష్టించారు. పాకిస్థాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ 500 వన్డే వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటివరకూ ఈ రికార్డును ఏ బౌలర్ బద్దలకొట్టకపోవడం విశేషం. అదేవిధంగా స్వదేశంలో 168 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా కూడా వసీం అక్రమ్ రికార్డుకెక్కాడు. శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్ 2001లో జింబాబ్వేపై 8 వికెట్లు తీసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డును సృష్టించాడు. రెండు దశాబ్దాల తర్వాత కూడాఈ ఏ బౌలర్ ఏడు వికెట్లకు మించి తీయలేకపోవడం గమనార్హం. పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ 2011లో వెస్టిండీస్ పై 7 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.
డబుల్ హ్యాట్రిక్ సాధించిన లసిత్ మలింగ
క్రికెట్‌లో ఏదైనా ఫార్మాట్‌లో హ్యాట్రిక్ వికెట్లు సాధించాలని బౌలర్లు ఆశ పడుతుంటారు. అయితే శ్రీలంక మాజీ సీమర్ లసిత్ మలింగ వన్డే క్రికెట్‌లో ఎక్కువ హ్యాట్రిక్ వికెట్లు సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. 2011లో రెండుసార్లు హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీయడాన్ని డబుల్ హ్యాట్రిక్ అంటారు. వన్డే క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడు మలింగ మాత్రమే. 2007 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై నాలుగు బంతుల్లో నాలుగు వరుస వికెట్లు తీశాడు. శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ వన్డే ప్రపంచకప్‌లో 68 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ 34 వికెట్లతో మురళీధరన్ కంటే వెనుకంజలో ఉన్నాడు.