Page Loader
BCCI: సచిన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు.. బెస్ట్ క్రికెటర్లుగా బుమ్రా, మంధాన
సచిన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు.. బెస్ట్ క్రికెటర్లుగా బుమ్రా, మంధాన

BCCI: సచిన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు.. బెస్ట్ క్రికెటర్లుగా బుమ్రా, మంధాన

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2025
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను 'జీవిత సాఫల్య' పురస్కారంతో గౌరవించనుంది. క్రికెట్లో భారతదేశానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత తొలి కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు పేరుతో 1994 నుండి 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్' అవార్డును ప్రదానం చేస్తోంది. ఈరోజు బీసీసీఐ నిర్వహించే కార్యక్రమంలో సచిన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించనున్నారు. రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచిన ఈ క్రికెటర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 664 మ్యాచ్‌లు ఆడి అద్భుత ప్రదర్శన చూపించాడు. 200 టెస్టుల్లో 15,291 పరుగులు, 51 శతకాలు బాదాడు. 463 వన్డేల్లో 18,426 పరుగులు, 49 సెంచరీలు చేశాడు.

Details

జస్ప్రీత్ బుమ్రాకు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు

గతేడాది అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియా స్పీడ్ స్టార్ జస్పిత్ బుమ్రాకు 'పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్' అవార్డును అందుకోనున్నారు. 2024లో అన్ని ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బుమ్రా టెస్టుల్లో మరింత ప్రభావశీలంగా రాణించాడు. గతేడాది 13 టెస్టుల్లో 71 వికెట్లు, ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో 32 వికెట్లతో రాణించాడు. టీ20 వరల్డ్‌కప్-2024 విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించి 15 వికెట్లు తీశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా బుమ్రా నిలిచాడు.

Details

 స్మృతి మంధానకు 'పాలీ ఉమ్రిగర్' మహిళా క్రికెటర్ అవార్డు

మహిళా క్రికెటర్ల విభాగంలో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఈ ఏడాది 'పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్' అవార్డును అందుకోనుంది. 2024లో వన్డేల్లో అత్యధికంగా 743 పరుగులు సాధించినందుకు గాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. భారత మహిళా జట్టులో అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచిన మంధాన పలు కీలక ఇన్నింగ్స్‌లను ఆడింది.