Team India: బాధలో ఉన్న టీమిండియా ప్లేయర్స్‌ను భుజం తట్టి ఓదార్చిన ప్రధాని (Video)
వన్డే వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో ఫైనల్‌కు చేరిన టీమిండియా (Team India), ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేసింది. చివరి మ్యాచులో ఆసీస్ చేతిలో ఓటమితో కోట్లాది మంది భారతీయులకు నిరాశే మిగిలింది. భారత జట్టు ఓడినా ప్రజల నుండి మద్దతు లభిస్తోంది. ప్రజలంతా సోషల్ మీడియా (Socail Media) వేదికగా రోహిత్ సేనకు మద్దతుగా పోస్టులు చేస్తున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సైతం టీమిండియా ప్లేయర్స్‌కు అండగా నిలబడ్డాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ టీమిండియా ప్లేయర్స్ డ్రస్సింగ్ రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ ప్లేయర్స్‌ను పేరు పేరునా పలకరించి, ఆటల్లో ఇలాంటివి సహజమని భుజం తట్టి ఓదార్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.