Page Loader
ఐపీఎల్ తరహాలో ప్రొ కబడ్డీ లీగ్.. 12 నగరాల్లో నిర్వహించేందుకు ప్లాన్!
ఐపీఎల్ తరహాలో ప్రొ కబడ్డీ లీగ్.. 12 నగరాల్లో నిర్వహించేందుకు ప్లాన్!

ఐపీఎల్ తరహాలో ప్రొ కబడ్డీ లీగ్.. 12 నగరాల్లో నిర్వహించేందుకు ప్లాన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2023
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఐపీఎల్ తర్వాత ఆ స్థాయి విశేష ఆదరణ దక్కించుకున్న టోర్నీ ప్రొ కబడ్డీ లీగ్. గత తొమ్మిది సీజన్లలో ఈ లీగ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా ఈ మెగా లీగ్ ను పరిమిత వేదికల్లోనే నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లో పదో సీజన్ జరగనుంది. ఐపీఎల్ మాదిరిగానే ఉన్న 12 జట్లకు చెందిన నగరాల్లో ఈ టోర్నీ నిర్వహించాలని ఆర్గనైజర్స్ నిర్ణయించారు. త్వరలోనే ఈ టోర్నీ పూర్తి షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు.

Details

డిసెంబర్ 2న పికేఎల్ టోర్నీ ప్రారంభం

పీకేఎల్ పదో సీజన్‌ను డిసెంబర్ 2 నుంచి ప్రారంభించనున్నట్లు లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి పేర్కొన్నారు. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఆటగాళ్ల వేలం నిర్వహిస్తామని చెప్పారు. గత తొమ్మిది సీజన్లు విజయవంతమయ్యాయని, పదో సీజన్ కూడా అందరికీ గుర్తిండిపోయేలా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకూ జరిగిన తొమ్మిది సీజన్లో పాట్నా పైరేట్స్ మూడు టైటిల్స్ గెలిచి ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.