టీమిండియా జట్టులో రవిచంద్రన్ అశ్విన్ తప్పకుండా ఉండాలి : ఎమ్మెస్కే ప్రసాద్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కేవలం టెస్టులోనే కొనసాగుతున్నాడు. గతేడాది బోలాండ్ పార్క్‌లో దక్షిణాఫ్రికా జరిగిన చివరి వన్డేలో అతను కనిపించాడు.
త్వరలో టీమిండియా జట్టు ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ టోర్నీలలో పాల్గొననుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కీలక సూచనలను చేశాడు.
టీమిండియా అద్భుతాలు సృష్టించడానికి రవిచంద్రన్ అశ్విన్ తప్పకుండా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డాడు.
ఆసియాకప్ కోసం పాకిస్థాన్ ఇప్పటికే తన జట్టును ప్రకటించగా, భారత్ తన స్క్వాడ్ ను ఇంకా ఖరారు చేయలేదు.
ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్‌కు ఎమ్మెస్కే ప్రసాద్ మద్దతుగా నిలిచాడు. ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ జట్టులో అశ్విన్ కు స్థానం కల్పించాలని ఆయన కోరారు.
Details
ఆసియా పిచ్ లపై అశ్విన్ నైపుణ్యాలు ఉపయోగపడతాయి
ఆసియా కప్ లపై ఆడుతున్న పరిస్థితుల్లో ప్రత్యర్థి జట్లలో ఎక్కువమంది ఎడమచేతి ఆటగాళ్లు ఉన్నారని, ఇలాంటి సమయంలో రవిచంద్రన్ అశ్విన్ జట్టుకు ఉపయోగపడతారని ఎమ్మెస్కే ప్రసాద్ వివరించారు.
ఆస్ట్రేలియా జట్టులో ఎంతోమంది లెప్ట్ హ్యాండర్లు ఉన్నారని, ముఖ్యంగా శ్రీలంక, భారత్‌తో ఆడుతున్న సమయాల్లో అశ్విన్ తప్పకుండా జట్టులో ఉండాలని ప్రసాద్ వెల్లడించారు.
ఆసియా పిచ్ లపై అశ్విన్ నైపుణ్యాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.