Pakistan: పాకిస్థాన్‌కు రావొద్దంటూ హెచ్చరికలు..విదేశీ క్రికెటర్లకు అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. టోర్నీ నిర్వహణలో ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక మార్పులు చేసింది. మ్యాచ్‌లను కేవలం రెండు నగరాలకు పరిమితం చేయడంతో పాటు భద్రతా ఏర్పాట్లను మరింత కఠినంగా అమలు చేస్తోంది. అదనంగా, ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించే అంశం కూడా పరిశీలనలో ఉంది. పాకిస్థాన్‌లోని ఒక సంఘం విదేశీ ఆటగాళ్లను హెచ్చరించింది. ముఖ్యంగా డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, డారిల్ మిచెల్ వంటి ప్రముఖులు పీఎస్ఎల్‌లో పాల్గొనకూడదని సూచించింది. వారు పాకిస్థాన్‌కు వస్తే వారి భద్రతకు హామీ ఇవ్వలేమని స్పష్టంగా తెలిపింది.
వివరాలు
టోర్నీకి అడ్డంకులు సృష్టిస్తామని బెదిరింపు
ఆ సంఘం ప్రకటన ప్రకారం తమకు క్రికెట్‌పై వ్యతిరేకత లేదని తెలిపింది. అయితే ప్రస్తుత భద్రతా పరిస్థితుల్లో అంతర్జాతీయ ఆటగాళ్లతో పెద్ద టోర్నీ నిర్వహించడం సరైనది కాదని పేర్కొంది. హెచ్చరికలను పట్టించుకోకుండా ఆటగాళ్లు పాల్గొంటే మ్యాచ్‌లను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తామని కూడా హెచ్చరించింది. ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భద్రతా చర్యలను పెంచింది. ప్రభుత్వ సూచనలను అనుసరించి టోర్నీ నిర్వహణలో మార్పులు చేపట్టింది. పశ్చిమ ఆసియా ప్రాంతంలోని పరిస్థితులు, ఇంధన ధరల పెరుగుదల వంటి అంశాల వల్ల ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది. అయినప్పటికీ తాజా హెచ్చరికలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి.
వివరాలు
టోర్నీ భవిష్యత్తుపై అనుమానాలు
ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ఆడమ్ జాంపా, మోయిన్ అలీ, డెవన్ కాన్వే వంటి ప్రముఖ ఆటగాళ్లు ఆడాల్సి ఉంది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా వారు టోర్నీ నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది పీఎస్ఎల్ ప్రతిష్టకు కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంది. మార్చి 26 నుంచి ప్రారంభం కావాల్సిన పీఎస్ఎల్ 2026 ఇప్పుడు సాగడం సందేహమే అనిపిస్తోంది. విదేశీ ఆటగాళ్లు పాల్గొంటారా లేదా అన్నది కీలక ప్రశ్నగా మారింది. ఈ పరిస్థితుల్లో టోర్నీ సాఫీగా జరుగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్:
🔴 JUST IN 🇵🇰
— Islamabad Post (@ISBPost) March 23, 2026
Armed opposition groups in Pakistan have issued a statement urging all foreign players participating in the Pakistan Super League (PSL) cricket matches to avoid traveling to Pakistan, stating that their security is not guaranteed and there is a risk of harm.
The… pic.twitter.com/caf7Tim1ep