IPL 2023: ధర్శశాలలో పంజాబ్ బ్యాటర్లు విజృంభణ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా ధర్శశాల వేదికగా 66వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శామ్ కర్రన్ 31 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 49 పరుగులు, జితేష్ శర్మ 28 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 44 పరుగులతో విజృంభించాడు. దీంతో పంజాబ్ గౌరవప్రదమైన స్కోరును చేసింది. మొదట్లో రాజస్థాన్ బౌలర్లు విజృంభించగా.. చివర్లో దారాళంగా పరుగులిచ్చారు.
3 వికెట్లతో చెలరేగిన నవదీప్ సైనీ
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కి మొదటి ఓవర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్, ప్రభుమాన్ సింగ్ (2) ని ఔట్ చేసి సత్తా చాటాడు. పంజాబ్ పవర్ ప్లే లోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన లివింగ్ స్టోన్ (9), కెప్టెన్ శిఖర్ ధావన్(17) పరుగులతో పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో జితేష్ శర్మ,శామకర్రన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు చేస్తూ పంజాబ్ స్కోరును పరిగెత్తించారు. షారుఖ్ ఖాన్(41), శామ్ కర్రన్(49) పరుగులతో చెలరేగారు. రాజస్థాన్ బౌలర్లలో సైనీ 3 వికెట్ల, బౌల్ట్, జంపా తలో వికెట్ తో రాణించారు.