
IPL 2025, LSG vs PBKS: లక్నో సూపర్‌జెయింట్స్ పై 8 వికెట్ల తేడాతో గెలిచిన పంబాబ్ కింగ్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 18లో పంబాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో 8వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా,ఛేదనలో పంజాబ్ కేవలం 16.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
ప్రభ్‌సిమ్రన్ సింగ్ 69 పరుగులు (34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) తో మెరవగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అజేయంగా 52 పరుగులు (30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) చేసి జట్టును గెలిపించాడు.
వధేరా కూడా 42 పరుగులు (25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) చేసి తన పాత్రను సమర్థంగా పోషించాడు.
వివరాలు
నిరాశపరిచిన మిచెల్ మార్ష్,రిషభ్ పంత్
లఖ్‌నవూ బ్యాటింగ్‌లో నికోలస్ పూరన్ 44 (30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆయుష్ బదోని 41 (33 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు.
అయితే మిచెల్ మార్ష్ (0), రిషభ్ పంత్ (2) నిరాశపర్చారు. పంజాబ్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా, ఫెర్గూసన్, మ్యాక్స్‌వెల్, మార్కో యాన్సెన్, చాహల్ తలో వికెట్ సాధించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఖ్‌నవూను చిత్తుచేసిన పంజాబ్ కింగ్స్
Match 13. Punjab Kings Won by 8 Wicket(s) https://t.co/j3IRkQFZpI #LSGvPBKS #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) April 1, 2025