
PV Sindhu: మలేసియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించిన పి.వి.సింధు
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ షట్లర్ పివి.సింధు పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది.తాజాగా జరిగిన మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఆమె మొదటి రౌండ్‌లోనే ఇంటికెళ్లాల్సి వచ్చింది.
బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో సింధు 11-21,21-14,15-21 స్కోర్లతో వియత్నాం ఆటగాళి లిన్ నుయెన్ చేతిలో ఓటమి పాలైంది.
ఇతర భారత మహిళా షట్లర్ల పరిస్థితి కూడా ఇదే తరహాలో నిరాశాజనకంగా ఉంది.
మాళవిక బాన్సోద్ 21-19,18-21, 8-21తో చైనీస్ తైపీకి చెందిన పిన్ చియాన్ చేతిలో ఓడిపోయింది.
ఆకర్షి కశ్యప్ 9-21, 8-21స్కోర్లతో ఇండోనేసియాకు చెందిన పుత్రి కుసుమ వర్దని చేతిలో పరాజయాన్ని చవిచూసింది.
ఉన్నతి హుడా కూడా 12-21,20-22తో చైనీస్ తైపీకి చెందిన లిన్ సియాంగ్ చేతిలో ఓటమిని మూటగట్టుకుంది.
వివరాలు
చైనా షట్లర్ గ్వాంగ్ జుపై విజయం సాధించిన కిదాంబి శ్రీకాంత్
అయితే పురుషుల విభాగంలో భారత ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబరిచారు.
హెచ్.ఎస్.ప్రణయ్ మొదటి రౌండ్‌లో జపాన్‌కి చెందిన కెంటా నిషిమోటోపై 19-21, 21-17, 21-16తో గెలుపొందాడు.
కిదాంబి శ్రీకాంత్ 23-21, 13-21, 21-11తో చైనా షట్లర్ గ్వాంగ్ జుపై విజయం సాధించాడు.
మరోవైపు కరుణాకరన్ 21-13, 21-14తో మూడో సీడ్ అయిన చైనీస్ తైపీకి చెందిన తీన్ చెన్‌ను ఓడించాడు.
ఆయుష్ శెట్టి కెనడాకు చెందిన బ్రయాన్ యాంగ్‌ను 20-22, 21-10, 21-8తో ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు.
ప్రియాన్షు రజావత్ మాత్రం తొలి రౌండ్‌లోనే పరాజయం చెందాడు. అతను సింగపూర్‌కి చెందిన హెంగ్ జేసన్ చేతిలో 15-21, 17-21తో ఓటమి పాలయ్యాడు.
వివరాలు
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో అదరగొట్టిన ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జోడీ
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో జోడీ అదరగొట్టింది.
ఈ జంట ఇండోనేసియాకు చెందిన అద్నాన్ మౌలానా - ఇదా జమీల్ జంటను 21-18, 15-21, 21-14తో ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
అదే విభాగంలో రోహన్ కపూర్ - గద్దె రుత్విక శివాని జంట మాత్రం 10-21, 14-21తో చైనా జంట షిన్ గువో - చెన్ ఫాంగ్ చేతిలో ఓటమి చవిచూసింది.