Page Loader
డబ్య్లూటీసీ ఫైనల్‌కు ముందు రహానే బర్త్ డే.. టీమిండియాలో వైబ్రేషన్స్!
టీమిండియా క్రికెటర్ అంజిక్యా రహానే

డబ్య్లూటీసీ ఫైనల్‌కు ముందు రహానే బర్త్ డే.. టీమిండియాలో వైబ్రేషన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2023
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

డబ్య్లూటీసీ ఫైనల్లో ఆసీస్ ను ఓడించి ఐసీసీ ట్రోఫీని సాధించాలని టీమిండియా తహతహలాడుతోంది. నేడు ఇంగ్లాండ్ లోని ఓవల్ వేదికగా టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య నేడు డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగుతోంది. ఇలాంటి కీలక మ్యాచ్ కు ముందు టీమిండియా క్రికెటర్లు, అంజిక్య రహానే బర్త్ డే సెలబ్రేట్ చేశారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత రహానే టెస్టు క్రికెట్ ను ఆడుతున్నారు. శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో రహానేకు ఛాన్స్ లభించింది. దేశవాళీలో అద్భుతంగా రాణించిన రహానే ఐపీఎల్ లో కూడా అదరగొట్టాడు. దీంతో మళ్లీ అతను టీమిండియాకు ఎంపికయ్యాడు.

Details

ఫామ్ లో ఉన్న అంజిక్యా రహానే

రహానే బర్తడే సందర్భంగా టీం మేట్స్ కేక్ ను రహానే ముఖం నిండా పులిమేశారు. ఈ ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులో చేసింది. 'అది పోవాలంటే చాలా కష్టపడి క్లీన్ చేయాలి రహానే' అని ఫోటోలకు బీసీసీఐ క్యాప్షన్ ఇచ్చింది. అంజిక్య రహానే 192 అంతర్జాతీయ మ్యాచుల్లో 8268 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా రహానే ఇదే జోరు కొనసాగించి జట్టుకు మంచి స్కోరు అందించాలని అశిస్తున్నారు. ఐపీఎల్ లో రాణించిన రహానే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఏ మేర రాణిస్తారో వేచి చూడాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అంజిక్య రహానే బర్త్ డే పిక్స్ షేర్ చేసిన బీసీసీఐ