Page Loader
AFG vs AUS: అఫ్గాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. సెమీస్ రేసులో నిలిచేదేవరు?
అఫ్గాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. సెమీస్ రేసులో నిలిచేదేవరు?

AFG vs AUS: అఫ్గాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. సెమీస్ రేసులో నిలిచేదేవరు?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2025
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లను వరుణుడు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాడు. ఇప్పటికే రావల్పిండి వేదికగా జరగాల్సిన ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ - బంగ్లాదేశ్ మ్యాచ్‌లు ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. ఇప్పుడు లాహోర్ వేదికగా జరగాల్సిన అఫ్గానిస్థాన్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది? ఇంగ్లాండ్‌పై సంచలన విజయం సాధించి జోరుమీదున్న అఫ్గాన్, ఆసీస్‌ను ఓడించి సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. గత టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌ను అఫ్గాన్ మట్టికరిపించిన సంగతి తెలిసిందే. అయితే వర్ష సూచన అఫ్గాన్‌ ఆశలపై నీళ్లు చల్లేలా కనిపిస్తోంది.

Details

ఆస్ట్రేలియా సెమీస్ కు వెళ్లే ఛాన్స్

లాహోర్‌లో శుక్రవారం వర్షపాతం 75% ఉండే అవకాశం మ్యాచ్‌ ప్రారంభానికి ముందు 35% వర్ష సూచన, రాత్రిపూట భారీ వర్షం అవకాశం కట్‌ ఆఫ్‌ టైమ్‌ రాత్రి 7 గంటల వరకు మాత్రమే 20 ఓవర్ల మ్యాచ్‌ నిర్వహించే అవకాశం ఒకవేళ మ్యాచ్‌ రద్దయితే, ఆస్ట్రేలియా నాలుగు పాయింట్లతో సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. అఫ్గాన్ మూడు పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. సౌతాఫ్రికాకు లక్కీ బ్రేక్ అఫ్గాన్ తప్పుకుంటే సౌతాఫ్రికా ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ పై ఆధారపడకుండా నాకౌట్‌కు చేరుతుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా నెట్ రన్‌రేట్ (+2.140) అఫ్గాన్ (-0.990) కంటే మెరుగ్గా ఉంది, అందుకే వారు వరుసగా ముందుకు వెళ్లే అవకాశముంది.