
Rajasthan Royals : గెలుపు జోష్ మీద రాజస్థాన్ రాయల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఆ స్టార్ ఆటగాడు దూరం!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే విజయాన్ని అందుకుంది.
సోమవారం సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో, ఆర్ఆర్ జట్టు 210 పరుగుల లక్ష్యాన్ని మరో 25 బంతులు మిగిలి ఉండగాలనే టార్గెట్ ను చేధించింది.
14 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 35 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో ఇది రాజస్థాన్‌కు మూడో విజయం కావడం గమనార్హం.
ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సిన ఆర్ఆర్‌కు ప్లేఆఫ్స్ చేరుకోవడం మాత్రం అంత సులువు కాదు.
Details
ముంబైతో జరిగే మ్యాచ్ కు సంజూ శాంసన్ దూరం
మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారీ మార్జిన్‌తో గెలవడంతో పాటు, పాయింట్ల పట్టికలో ఉన్న అగ్ర జట్లు ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉండగా.. మే 1న ముంబై ఇండియన్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కు రాజస్థాన్ సన్నద్ధమవుతోంది. అదే సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
అయితే గుజరాత్‌పై గెలుపుతో ఉన్న ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. సంజు శాంసన్ ముంబై మ్యాచ్‌కు దూరం కానున్నాడని వార్తలు విన్పిస్తున్నాయి.
పక్కటెముకల గాయం నుంచి ఆయన ఇంకా పూర్తిగా కోలుకోకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.