PBKS Vs RR : ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్.. ప్లేఆఫ్ రేసులోనే రాజస్థాన్!
ఈ వార్తాకథనం ఏంటి
ధర్శశాల వేదికగా జరిగిన 66వ మ్యాచులో పంజాబ్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది.
తప్పక గెలవాల్సిన మ్యాచులో రాజస్థాన్ సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.
రాజస్థాన్ 19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో శామ్ కర్రన్(49), జితేష్ శర్మ(44), షారుఖ్ ఖాన్ (41) రన్స్ చేయడంతో పంజాబ్ భారీ స్కోరును చేసింది.
రాజస్థాన్ బౌలర్లలో నవదీప్ సైనీ 3 వికెట్లతో మెరిశాడు.
Details
అర్ధ సెంచరీలతో చెలరేగిన ఫడిక్కల్, జైస్వాల్
లక్ష్య చేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ కి రెండో ఓవర్లలో గట్టి షాక్ తగిలింది. జోస్ బట్లర్(0) డకౌట్ తో నిరాశపరిచాడు.
తర్వాత యశస్వీ జైస్వాల్, దేవదుత్ ఫడక్కిల్ రాజస్థాన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో చేలరేగి పంజాబ్ కు విజయాన్ని చేరువ చేశారు.
జైస్వాల్(50), ఫడక్కిల్(51) పరుగులతో చెలరేగారు. చివర్లో హిట్ మేయర్ 46 పరుగులతో విజృంభించడంతో రాజస్థాన్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
పంజాబ్ బౌలర్లలో రబడా రెండు వికెట్లు, అర్షదీప్ సింగ్, సామ్ కర్రన్, ఇల్లీస్, రాహుల్ చాహర్ తలా ఓ వికెట్ తీశారు.