Page Loader
Raman Subba Row: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ మృతి.. 
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ మృతి..

Raman Subba Row: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ మృతి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 19, 2024
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్,ఐసీసీ మ్యాచ్ రిఫరీ ర‌మ‌న్ సుబ్బా రో (92) కన్నుమూశారు. అయన ఇంగ్లండ్ పురుషుల టెస్టు ఆటగాడు. 1961లో క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. రామన్ తన కెరీర్‌లో 13 టెస్టు మ్యాచ్‌లలో 22 ఇన్నింగ్స్‌లలో 984 పరుగులు చేశాడు. 1932 లండన్‌లోని స్ట్రీథమ్‌లో జన్మించిన రామన్ తొలిసారిగా కేంబ్రిడ్జ్‌లో 1951 వర్సిటీ మ్యాచ్‌లో 21 పరుగులకు 5 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. 1953లో చదువుకున్న తర్వాత,లండన్‌లోని ఓవల్‌లో సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్‌తో క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. అయన జూలై 1958లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుపై తన అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో అయన 3సెంచరీలు,4 హాఫ్ సెంచరీలు చేశాడు.ఈ ఫార్మాట్‌లో అయన అత్యధిక స్కోరు 137 పరుగులు.

Details 

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రామన్ 87 విజయాలు

రామన్ 1955లో నార్తాంప్టన్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌కు మారారు, అక్కడ అయన 1958లో కౌంటీ కెప్టెన్ అయ్యాడు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో ర‌మ‌న్ సుబ్బ‌రో 260 మ్యాచ్‌ల్లో 407 ఇన్నింగ్స్‌ల్లో 14182 పరుగులు చేశాడు. అయన 41.46 సగటుతో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 73 అర్ధసెంచరీలతో పాటు 30 సెంచరీలు చేశాడు. అయన అత్యుత్తమ స్కోరు 300 పరుగులు. రామన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 87 విజయాలు కూడా సాధించాడు. అయన బౌలింగ్ సగటు 38.65,ఎకానమీ 3.23. 1991లో క్రికెట్‌కు చేసిన సేవలకుగానూ అయనకి CBE లభించింది. 1992 - 2001 మధ్య అయన ఐసీసీకి మ్యాచ్ రిఫరీగా 41 టెస్టులు, 119 వన్డేలను పర్యవేక్షించాడు.

Details 

ఈ ఇంగ్లండ్ ఆటగాడు మన తెలుగోడే

రామన్‌ సుబ్బా రో తండ్రి పంగులూరి వెంకట సుబ్బారావు. వీరు ఆంధ్రప్రదేశ్‌ లోని బాపట్లకు చెందిన వారు. సుబా​ రో తల్లి డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్. ఆవిడ బ్రిటన్‌ మహిళ. రామన్‌ సుబ్బా రో తండ్రి ఉన్నత చదువుల కోసం లండన్‌కు వెళ్లి అక్కడ డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్‌ తో పరిచయం ఏర్పడి, అదికాస్తా ప్రేమగా మారి, పెళ్లికి దారి తీసింది. వీరిద్దరి సంతానమే రామన్‌ సుబ్బా రో.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇంగ్లండ్ క్రికెట్ చేసిన ట్వీట్