Ranji Trophy: విరాట్ కోహ్లీని ఔట్ చేయడంలో సంగ్వాన్‌కు బస్సు డ్రైవర్ సలహా
ఈ వార్తాకథనం ఏంటి
పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) తన మునుపటి ఆట తీరును తిరిగి పొందేందుకు దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పాల్గొన్నారు.
రైల్వేస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో దిల్లీ జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది.
అయితే, ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన కోహ్లీ కేవలం 6 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.
రైల్వేస్ బౌలర్ హిమాన్షు సంఘ్వాన్ (Himanshu Sangwan) బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
హిమాన్షు సంఘ్వాన్ కోహ్లీ వికెట్‌ను తీసి వార్తల్లో నిలిచాడు. ఆశ్చర్యకరంగా, విరాట్ కోహ్లీని ఎలా ఔట్ చేయాలో తమ జట్టు బస్సు డ్రైవర్ తనకు సూచనలు ఇచ్చినట్లు హిమాన్షు పేర్కొన్నాడు.
వివరాలు
బస్సు డ్రైవర్ సూచన
5వ స్టంప్ లైన్‌లో బౌలింగ్ చేయాలని డ్రైవర్ సూచించినట్లు వెల్లడించాడు.
ఈ సూచనలు విన్నప్పుడూ తాను ఆశ్చర్యపోయానని, కానీ, విరాట్ కోహ్లీ బలహీనతల కంటే తన బలాలపైనే దృష్టి పెట్టి బౌలింగ్ చేసినట్లు హిమాన్షు వివరించాడు.
కోహ్లీ ఆఫ్‌సైడ్‌కు వెళ్తున్న బంతులను ఆడటంలో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారని ఇప్పటికే బాగా ప్రచారం ఉంది.
వివరాలు
నా జట్టు సహచరులు నన్ను ఉత్సాహపరిచారు
'మ్యాచ్‌కు ముందు, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ దిల్లీ జట్టులో ఉన్నారని చెప్పారు.అయితే,పంత్ ఆడలేదు.మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతోందని మొదట మాకు తెలియదు.తర్వాత తెలిసింది. రైల్వేస్ బౌలింగ్ విభాగాన్ని నేను ముందుండి నడిపిస్తున్నాను.మా కోచ్‌లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయాలని సూచించారు. నా జట్టు సహచరులు నన్ను ఉత్సాహపరిచారు - కోహ్లీ వికెట్ నేనే తీయగలనని చెప్పారు. బస్సు డ్రైవర్ కూడా నాలుగో లేదా ఐదో స్టంప్ లైన్‌లో బంతులు వేయాలని సూచించాడు. కానీ, నేను నా బలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. అదే విధంగా బౌలింగ్ చేసి కోహ్లీని ఔట్ చేశాను' అని సంఘ్వాన్ చెప్పాడు.
వివరాలు
కోహ్లీతో ప్రత్యేకమైన మూమెంట్
'విరాట్ కోహ్లీని ఔట్ చేయడానికి ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించలేదు.
మా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తూ కోహ్లీతో కలిసి చేతులు కలిపి మాట్లాడాను.
అతను బాగా బౌలింగ్ చేశావని అభినందించాడు. లంచ్ బ్రేక్‌లో ఫోటో దిగాలని కోరగా, కోహ్లీ అంగీకరించాడు.
నేను కోహ్లీని ఔట్ చేసిన బంతిని తీసుకొని దిల్లీ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి అతడితో కలిసి ఫోటో దిగాను' అని హిమాన్షు సంఘ్వాన్ వివరించాడు.