రోహిత్ కెప్టెన్సీపై రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ ఐపీఎల్ లో 10 ఇన్నింగ్స్ లు ఆడిన హిట్ మ్యాన్ 200 పరుగులను కూడా చేయలేకపోయాడు. ఇక ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్ మెన్స్ గా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున మాత్రమే 65 పరుగులను చేశాడు. ఈ ఏడాది పది మ్యాచ్ ల్లో ఐదు గెలిచి ఆరోస్థానంలో నిలిచింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం రోహిత్ శర్మ ట్రోల్ ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి, హిట్ మ్యాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రోహిత్ జట్టును విజయపథంలో నడిపించాలి
రెండు, మూడేళ్ల కిందట ముంబై జట్టు బాగుందని, ఇప్పుడు రోహిత్ కు అసలైన సవాలు ఎదురైందని, టీమ్ ను ఎలా మోటివేట్ చేయాలి? ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో హిట్ మ్యాన్ ప్రణాళికలు రచించాలని రవిశాస్త్రి పేర్కొన్నారు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఎనర్జీతో కనిపించే రోహిత్.. పరుగులు చేయడంలో విఫమవుతున్నాడని, అదే విధంగా కెప్టెన్ గా సవాళ్లు రెట్టింపు అయ్యాయని, రెండేళ్ల కిందటితో పోలిస్తే కెప్టెన్ పని కూడా ఎక్కువైందని చెప్పారు. వచ్చే రెండేళ్లలో ముంబై జట్టు సక్సెస్ అవుతుందని, కానీ ఆ దిశగా జట్టును రోహిత్ తయారు చేయాలని రవిశాస్త్రి చెప్పాడు.