Ravichandran Ashwin : చెత్తకు పరిష్కారం అవసరమన్న అశ్విన్.. రోహిత్ శర్మను లక్ష్యంగా చేసిందా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత అభిమానుల ఆశలకు గండికొడుతూ, ఆస్ట్రేలియాపై నాలుగో టెస్టులో టీమిండియా ఘోర పరాజయం పాలైంది.
రెండో ఇన్నింగ్స్‌లో యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ పోరాడినా స్టార్ ఆటగాళ్ల వైఫల్యంతో బాక్సింగ్ డే టెస్టులో భారత్ పరాభవాన్ని చవిచూసింది.
ఈ ఓటమితో రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై మరోసారి చర్చలు మొదలయ్యాయి. ఈ సందర్భంలో మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్ సమయంలో టీమ్‌ఇండియా కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో రవిచంద్రన్ అశ్విన్ తన ఎక్స్ ఖాతాలో చేసిన ఓ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
Details
కొత్త నాయకులు రావాలి
'చెత్తకు పరిష్కారం చూపించినప్పుడు మాత్రమే కొత్త నాయకులు ఉద్భవిస్తారని ఆయన రాసుకొచ్చారు.
తర్వాత మరో పోస్ట్‌లో ఫ్యాన్ క్లబ్‌లు ఉన్న వ్యక్తుల గురించి తాను మాట్లాడడం లేదని స్పష్టం చేశాడు.
ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మపై చేసిన విమర్శలుగా నెటిజన్లు భావిస్తున్నారు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరుసగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే.
కీలకమైన బాక్సింగ్ డే టెస్టులో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌లోనూ ఈ ఇద్దరూ తమ పేలవ ప్రదర్శన కొనసాగించారు.
దీనికి నిరాశ చెందిన అభిమానులు, వీరిని జట్టు నుంచి తప్పించాలని, అలాగే టెస్టు క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానిస్తున్నారు.
Details
జైస్వాల్ ఔట్ పై వివాదం
ఇక బాక్సింగ్ డే టెస్టులో యశస్వీ జైస్వాల్ (84) మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ, అతని ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది.
స్నికో మీటర్‌లో స్పైక్స్ కనిపించకపోయినా థర్డ్ అంపైర్ అతన్ని ఔటుగా ప్రకటించడం చర్చకు దారితీసింది. దీనిపై అశ్విన్ కూడా స్పందించారు.
ఇది ఆసక్తికరమైన, కీలక క్షణమని వ్యాఖ్యానించాడు.