Page Loader
RCB vs RR : రాజస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు
రాజస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు

RCB vs RR : రాజస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2025
06:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచులో బెంగళూర్ రాయల్‌ ఛాలెంజర్స్‌ విజయం సాధించింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 173 పరుగులు చేసింది. జైస్వాల్‌(75: 47 బంతుల్లో, 10 ఫోర్లు, 2 సిక్సులు) అర్ధశతకంతో రాణించాడు. చివర్లో ధ్రువ్‌ జురెల్‌(35*) అదరగొట్టాడు. లక్ష్య చేధనలో ఆర్సీబీ 17.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 175 పరుగులు చేసింది. పిలిప్ సాల్ట్ (65: 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (62*: 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు.

Details

తేలిపోయిన రాజస్థాన్ బౌలర్లు

ఇక ఫడిక్కల్ (40: 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో ఆర్సీబీ సునాయాసంగా విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది నాలుగో విజయం కాగా, రాజస్థాన్‌కు నాలుగో ఓటమి. ఈ మ్యాచులో రాజస్థాన్ బౌలర్లు తేలిపోయారు. కేవలం ఒక వికెట్ ను మాత్రమే పడగొట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తొమ్మిది వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపు