Page Loader
IPL Auction -Jitesh Sharma: ఐపీఎల్‌లో భారీ మొత్తంలో సాలరీ హైక్‌ సాధించిన ప్లేయర్‌ ఎవరంటే..? 
ఐపీఎల్‌లో భారీ మొత్తంలో సాలరీ హైక్‌ సాధించిన ప్లేయర్‌ ఎవరంటే..?

IPL Auction -Jitesh Sharma: ఐపీఎల్‌లో భారీ మొత్తంలో సాలరీ హైక్‌ సాధించిన ప్లేయర్‌ ఎవరంటే..? 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2024
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటివరకు భారత క్రికెటర్లు ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో భారీ మొత్తం పొందడం తెలిసిందే. అందులో రిషబ్ పంత్ (రూ. 27 కోట్లు), శ్రేయస్ అయ్యర్ (రూ. 26.75 కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ. 23.75 కోట్లు) వంటి క్రికెటర్లు టాప్‌ ధరలు సాధించారు. అయితే, ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో అత్యధిక మొత్తం పొందిన క్రికెటర్‌గా రిషభ్ పంత్ నిలిచినా, భారత యువ బ్యాటర్ జితేశ్ శర్మ మాత్రం మరొక ప్రత్యేక ఘనత సాధించాడు. జితేశ్ శర్మను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రూ. 11 కోట్లకు కొనుగోలు చేసింది. అతడు కనీసం రూ. 1 కోటి ధరతో వేలంలోకి వచ్చినప్పటికీ,ఆర్సీబీ అతనికి భారీ సొమ్ము ఇచ్చింది.

వివరాలు 

పంజాబ్‌ తరఫున జితేశ్ శర్మ కీలక ఇన్నింగ్స్‌ 

గతంలో పంజాబ్‌ కింగ్స్‌ తరఫున ఆడిన జితేశ్ శర్మకు వచ్చిన మొత్తం రూ. 20 లక్షలే, కానీ ఇప్పుడు రూ. 11 కోట్లతో అతను 55 రెట్లు ఎక్కువ దక్కినట్లైంది. ఐపీఎల్‌లో ఇంత భారీ ధర పొందిన ఆటగాడు మరొకరు లేరు. గత రెండు సీజన్లలో పంజాబ్‌ తరఫున జితేశ్ శర్మ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతను వికెట్ కీపర్‌గా కూడా వ్యవహరిస్తూ, భారీ సిక్స్‌లను కొట్టగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. మరోవైపు, ఆర్సీబీకి దినేశ్ కార్తిక్‌ తర్వాత ఫినిషర్‌ కమ్ వికెట్ కీపర్ కావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, జితేశ్ శర్మకు తమ టీమ్‌లో లోయర్ ఆర్డర్‌లో కీలక పాత్ర ఇవ్వాలని ఆర్సీబీ భావిస్తున్నది.

వివరాలు 

200 శాతం పెరిగిన శ్రేయస్ అయ్యర్ సాలరీ 

రిషభ్ పంత్‌ ఐపీఎల్‌ 2025 వేలంలో రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చి, లఖ్నవూ సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. అతని సాలరీకి 175 శాతం పెంపు వచ్చింది. అలాగే,శ్రేయస్ అయ్యర్ సాలరీ కూడా 200 శాతం పెరిగింది. 2022 వేలంలో కోల్‌కతా అతనికి రూ.12.25 కోట్లని ఇచ్చింది, కానీ ఇప్పుడు పంజాబ్‌ రూ. 26.75 కోట్లు అందించింది. వెంకటేశ్ అయ్యర్‌కు గతంలో ఇచ్చిన రూ. 8కోట్ల కంటే ఈసారి మూడు రెట్ల పెంపు కలిగి,కోల్‌కతా అతనిని రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే,అర్ష్‌దీప్‌ రూ.4కోట్ల నుండి ఇప్పుడు రూ.18కోట్ల వరకు పెరిగారు.చాహల్ కూడా రూ.6.5కోట్ల నుండి రూ.18కోట్ల వరకు పెరిగారు,ఇది నిజంగా గమనించదగిన విషయం.