
RCB vs CSK : చైన్నైతో ఆర్సీబీ మ్యాచ్.. మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య పోరు జరగనుంది.
ఈ మ్యాచ్‌కి ముందు ఇప్పుడు ఫోకస్ మొత్తం విరాట్ కోహ్లీ పైనే ఉంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఓ అరుదైన మైలురాయిని చేరుకునే అవకాశంలో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ 51 పరుగులు చేస్తే, ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది.
ఆయన పంజాబ్ కింగ్స్‌పై 26 మ్యాచ్‌ల్లో 1134 పరుగులు చేశాడు. కోహ్లీ ఇప్పటికే చెన్నైపై 34 మ్యాచ్‌ల్లో 1084 పరుగులు చేశాడు.
Details
51 పరుగుల దూరంలో కోహ్లీ
ఇంకో 51 పరుగులు చేస్తే వార్నర్ రికార్డును అధిగమించనున్నాడు. కోహ్లీ ఇప్పటికే ఐపీఎల్‌లో మూడు వేర్వేరు జట్లపై 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఏకైక ఆటగాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 1130 పరుగులు, పంజాబ్ కింగ్స్‌పై 1104 పరుగులు చేశాడు.
ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన టాప్ ఆటగాళ్లు ఇలా ఉన్నారు
డేవిడ్ వార్నర్ -1134 పరుగులు (పంజాబ్ కింగ్స్‌పై)
విరాట్ కోహ్లీ -1130 పరుగులు (ఢిల్లీ క్యాపిటల్స్‌పై)
విరాట్ కోహ్లీ -1104 పరుగులు (పంజాబ్ కింగ్స్‌పై)
డేవిడ్ వార్నర్ - 1093 పరుగులు (కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై)
విరాట్ కోహ్లీ - 1084 పరుగులు (చెన్నై సూపర్ కింగ్స్‌పై)
రోహిత్ శర్మ - 1083 పరుగులు (కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై)
Details
10 మ్యాచుల్లో 443 పరుగులు
ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో కోహ్లీ ఫాంటాస్టిక్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 63.29 సగటుతో 443 పరుగులు చేశాడు.
ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. RCB తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
జట్టు పరంగా చూస్తే, ఆర్‌సీబీ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి, 7 విజయాలతో 14 పాయింట్లు సాధించింది.
నెట్ రన్‌రేట్ +0.521తో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. చెన్నైపై గెలిస్తే, ఆర్‌సీబీ రెండో స్థానానికి ఎగబాకే అవకాశం ఉంది.