LOADING...
Kuldeep Yadav: పాకిస్థాన్‌లో ఆడేందుకు సిద్ధం : కుల్దీప్ యాదవ్

Kuldeep Yadav: పాకిస్థాన్‌లో ఆడేందుకు సిద్ధం : కుల్దీప్ యాదవ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 27, 2024
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీపై సర్వత్రా ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే పాక్ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఈ మెగా టోర్నీకి సంబంధించిన ముసాయిదా షెడ్యూల్‌ని అంతర్జాతీయ క్రికెట్‌ మండలికి సమర్పించింది. భద్రతా కారణాలు, ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో భారత జట్టు పాకిస్థాన్ పర్యటన చేస్తుందా అనే ప్రశ్న పై ఇప్పటికీ స్పష్టత రాలేదు. భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్తుందా లేదా అన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని బీసీసీఐ ప్రకటించింది.

Details

క్రికెటర్ గా ఎక్కడైనా ఆడటం మా బాధ్యత

ఇదే విషయంపై భారత స్టార్‌ స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్ స్పందించాడు. ''క్రికెటర్‌గా ఎక్కడైనా ఆడటం తమ బాధ్యత అని, పాకిస్థాన్‌లో ఆడే అవకాశం వస్తే, తప్పకుండా వెళ్లి ఆడతానని చెప్పాడు. ఇప్పటివరకు పాకిస్థాన్‌లో ఆడే అవకాశం రాలేదని, ఆ అవకాశం వస్తే తప్పకుండా వెళతానని కుల్‌దీప్‌ ఒక ఈవెంట్‌లో చెప్పాడు. అయితే, ఛాంపియన్స్‌ ట్రోఫీ రీషెడ్యూల్ అవుతుందన్న వార్తలను పీసీబీ ఖండించింది.

Details

స్పందించిన పీసీబీ

కరాచీ, గడాఫీ, రావల్పిండి స్టేడియాలను ఆధునీకరణ చేస్తున్న నేపథ్యంలో టోర్నీ జరిగే అవకాశం ఉందని కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. దీనిపై పీసీబీ క్లారిటీ ఇచ్చింది. చైర్మన్ జకీర్‌ ఖాన్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేశారని పేర్కొంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉంది.