Page Loader
Asian Games 2023 : సాత్విక్, చిరాగ్ జోడి సంచలనం.. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి స్వర్ణం
సాత్విక్, చిరాగ్ జోడి సంచలనం.. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

Asian Games 2023 : సాత్విక్, చిరాగ్ జోడి సంచలనం.. బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 07, 2023
05:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో భారత సంచలన విజయం సాధించింది. భారత స్టార్ షట్లర్లు సాత్విక్-చిరాగ్ శెట్టి చరిత్రను సృష్టించారు. ఫైనల్లో సౌతా కొరియా చి సోల్గ్యు-కిమ్ వోన్హో పై 21-18, 21-16 తేడాతో విజయం సాధించారు. దీంతో ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ డబుల్స్ ఫైనల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ జోడిగా వీరిద్దరూ రికార్డుకెక్కాడు. ఇక ఈ విజయంలో భారత్ ఖాతాలో పసిడి పతకాల సంఖ్య 26 కాగా, మొత్తం 101 పతకాలను సాధించింది. ఇందులో రజతం 35, కాంస్యం 40 ఉన్నాయి.

Details

బ్యాడ్మింటన్ మొట్టమొదటి గోల్డ్ మెడల్

తొలి గేమ్‌లో విజయం సాధించేందుకు భారత జోడికి కేవలం 29 నిమిషాల సమయం పట్టింది. అయితే రెండో గేమ్‌లో దక్షిణ కొరియా జోడీ భారత్‌కు గట్టి పోటినిచ్చింది. ఈ మ్యాచ్ ఉత్కంఠంగా 57 నిమిషాల పాటు సాగింది. 2023 సంవత్సరంలో చిరాగ్, సాత్విక్ స్విస్ ఓపెన్, బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్ షిప్, ఇండోనేషియా ఓపెన్, కొరియా ఓపెన్ టైటిళ్లను గెలిచారు. ఆసియా గేమ్స్ చరిత్రలో బ్యాడ్మింటన్ లో భారత్ కు దక్కిన మొట్టమొదటి గోల్డ్ మెడల్ ఇదే కావడం విశేషం.