Page Loader
IND vs BAN: శుభ్‌మన్‌ గిల్‌కు విశ్రాంతి.. మరో కీలక ప్లేయర్‌కి ఛాన్స్!
శుభ్‌మన్‌ గిల్‌కు విశ్రాంతి.. మరో కీలక ప్లేయర్‌కి ఛాన్స్!

IND vs BAN: శుభ్‌మన్‌ గిల్‌కు విశ్రాంతి.. మరో కీలక ప్లేయర్‌కి ఛాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2024
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, బంగ్లాదేశ్‌ మధ్య సెప్టెంబర్ 19న టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. బంగ్లాతో టెస్ట్ సిరీస్‌కు ముందు టీ20 సిరీస్ కోసం జట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. అక్టోబర్‌ 7 నుంచి జరిగే మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. అతనిపై పని భారం తగ్గించాలనే ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీని ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. ఈ సీజన్‌లో టీమిండియా జట్టు 10 టెస్ట్ మ్యాచ్‌లను ఆడనుంది. ఇందులో గిల్ పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.

Details

ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చే అవకాశం!

గిల్‌తో పాటు, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలకు కూడా విశ్రాంతినిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు రిషబ్ పంత్‌కు కూడా ఈ టీ20 సిరీస్‌లో రెస్ట్ ఇస్తే మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ జట్టులోకి తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. అక్టోబర్ 16న న్యూజిలాండ్‌తో మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆటగాళ్ల శారీరక, మానసిక శక్తిని తగ్గించేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.