LOADING...
Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..? 
జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?

Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌ వివాహబంధంలో అడుగు పెట్టనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌తో ఆయన నిశ్చితార్థం త్వరలో జరగనుంది. జూన్‌ 8న లఖ్‌నవూలోని ఓ లగ్జరీ హోటల్‌లో ఈ ఎంగేజ్‌మెంట్‌ వేడుక జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. రింకూ, ప్రియ మధ్య సాన్నిహిత్యం గతేడాది నుంచే కొనసాగుతోంది. గతంలో ప్రియ తండ్రి తుపాని సరోజ్‌ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ''వాళ్లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇరు కుటుంబాలు ఈ సంబంధాన్ని అంగీకరించాయి'' అని తెలిపారు.

Details

ప్రియకు సుప్రీం కోర్టు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం

ప్రస్తుతం మచిలీషహర్‌ నుంచి ఎంపీగా ప్రియ సరోజ్‌ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వయసు 25 ఏళ్లే అయినా, ఆమెకు సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉంది. మరోవైపు రింకూ సింగ్‌ టీమ్‌ఇండియాలో ఓ ప్రతిభావంతమైన యువ క్రికెటర్‌గా నిలిచారు. ఆటపట్ల నిబద్ధతతో పాటు, వ్యక్తిగత జీవితంలో కూడా మరో కీలక దశకు చేరుకుంటున్నారు.