LOADING...
Rishabh Pant: లక్నో సూపర్ జెయింట్స్ సారిథిగా రిషబ్ పంత్ నియామకం
లక్నో సూపర్ జెయింట్స్ సారిథిగా రిషబ్ పంత్ నియామకం

Rishabh Pant: లక్నో సూపర్ జెయింట్స్ సారిథిగా రిషబ్ పంత్ నియామకం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2025
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2025 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్‌ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరతో రిషబ్ పంత్‌ను సొంతం చేసుకున్న ఫ్రాంఛైజీ, అతడిని కెప్టెన్‌గా నియమించినట్లు ప్రకటించింది. కోల్‌కతాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ కార్యక్రమంలో పంత్‌ కూడా పాల్గొని తన కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. గతేడాది నవంబర్‌లో జరిగిన మెగా వేలంలో లఖ్‌నవూ పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దిల్లీ సారథిగా తన నైపుణ్యాలను ప్రదర్శించిన పంత్‌ను లఖ్‌నవూ కెప్టెన్‌గా నియమించేందుకు యజమాన్యం పెద్ద మొత్తం వెచ్చించిందని వార్తలొచ్చాయి.

Details

పంత్ అత్యుత్తమ ఆటగాడు

మొదట నికోలస్ పూరన్‌ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగినా చివరికి పంత్‌కే యజమాన్యం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రిషభ్ పంత్ ఐపీఎల్‌లో అత్యంత విలువైన ఆటగాడు మాత్రమే కాదని, అత్యుత్తమ ఆటగాడని చెప్పారు. ప్రస్తుతం మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ విజయవంతమైన కెప్టెన్లుగా గుర్తింపు పొందారని, రాబోయే 10-12 ఏళ్లలో రిషభ్ పంత్ కూడా వారి సరసన చేరతారని సంజీవ్ గొయెంకా వెల్లడించారు.