Rishabh Pant: ధోనీ రికార్డును సమం చేసిన రిషబ్ పంత్
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరో అరుదైన ఘనతను సాధించాడు. సుమారు 21 నెలల బ్రేక్ తర్వాత టెస్టు క్రికెట్‍లో రీఎంట్రీ ఇచ్చిన భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తాజాగా బంగ్లాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో దుమ్మురేపాడు. బంగ్లాదేశ్‍తో జరుగుతున్న తొలి టెస్టులో శకతంతో విజృంభించాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 128 బంతుల్లో 109 పరుగులు చేసి శకతంతో అదరగొట్టాడు. తద్వారా టెస్టుల్లో భారత్ తరుఫున ఇప్పటివరకూ టెస్టుల్లో పంత్ ఆరు శతకాలను బాదాడు.
34వ మ్యాచులోనే ఆరో శతకాన్ని నమోదు చేసిన పంత్
భారత్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాజీ కెప్టెన్, దిగ్గజం ఎంఎస్ ధోనీ రికార్డును పంత్ ఇప్పుడు సమం చేశాడు. 90 టెస్టుల్లో ధోనీ ఇప్పటివరకూ ఆరు టెస్టు సెంచరీలు చేస్తే.. పంత్ కేవలం 34వ మ్యాచ్‍లోనే ఆరో శతకాన్ని నమోదు చేశాడు. మరో టెస్టు సెంచరీ చేస్తే పంత్, ధోనీని దాటేస్తాడు. వీరిద్దరి తర్వాత వృద్ధిమాన్ సాహా(3) ఉన్నారు