Page Loader
Riyan Parag: నాపై నాకున్న నమ్మకం.. భారత జట్టుకు తప్పకుండా ఆడతా!
Riyan Parag: నాపై నాకున్న నమ్మకం.. భారత జట్టుకు తప్పకుండా ఆడతా!

Riyan Parag: నాపై నాకున్న నమ్మకం.. భారత జట్టుకు తప్పకుండా ఆడతా!

వ్రాసిన వారు Sirish Praharaju
May 30, 2024
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్(Riyan Parag) ఐపీఎల్ 2024లో తన ప్రదర్శనతో నిలకడగా రాణించి ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో అతడు బ్యాట్ తో రెచ్చిపోయాడు. అయితే, 2024 టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టులో అతనికి చోటు దక్కలేదు. అయితే ఏదో ఒక రోజు భారత్‌కు ఆడతాననే నమ్మకంతో ఉన్నాడు ఈ యువ బ్యాట్స్‌మెన్. అతని ప్రస్తుత ప్రదర్శనను చూస్తుంటే, జూలైలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సెలెక్టర్లు ర్యాన్‌ను జట్టులో చేర్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అస్సాంకు చెందిన రియాన్ పరాగ్ ఐపీఎల్ 17వ సీజన్‌లో టాప్‌ స్కోరర్లలో మూడో స్థానంలో నిలిచాడు.

Details 

నాకు అహంకారం ఏమీ లేదు: రియాన్‌

ప్రత్యర్థి జట్లపై బ్యాట్‌తో దూకుడు ప్రదర్శించి తన జట్టును క్వాలిఫయర్-2కు తీసుకెళ్లాడు. 22ఏళ్ల బ్యాట్స్‌మెన్ 14 ఇన్నింగ్స్‌లలో నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 573 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతని అత్యధిక స్కోరు 84 పరుగులు*. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రియాన్‌ పరాగ్‌ మాట్లాడుతూ.. తప్పకుండా టీమిండియాకు ఆడతానని.. ఐపీఎల్‌లో నేను పెద్దగా పరుగులు చేయనపుడే ఓ ఇంటర్వ్యూలో చెప్పా. అది నాపై నాకున్న నమ్మకం. అలా అన్నానని నాకు అహంకారం ఏమీ లేదు. పదేళ్ల వయసులో క్రికెట్‌ మొదలుపెట్టినపుడే ఇండియాకి ఆడతానని అనుకున్నా.ఏదో ఒక దశలో సెలెక్టర్లు నన్ను భారత జట్టుకు ఎంపిక చేయక తప్పదు.అయితే ఎప్పుడన్నది నాకు తెలియదు. భారత జట్టుకు మాత్రం తప్పకుండా ఆడతా' అని చెప్పాడు.