Page Loader
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ ఆల్‌టైమ్ ఇండియా ఎలెవన్‌లో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాకి షాక్  
గౌతమ్ గంభీర్ ఆల్‌టైమ్ ఇండియా ఎలెవన్‌లో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాకి షాక్

Gautam Gambhir: గౌతమ్ గంభీర్ ఆల్‌టైమ్ ఇండియా ఎలెవన్‌లో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాకి షాక్  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2024
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

గౌత‌మ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా తన పర్యటన శ్రీలంకతో ప్రారంభమైంది. ఈ పర్యటనలో గంభీర్ కోచ్‌గా మిశ్ర‌మ ఫ‌లితాలను పొందాడు. భార‌త జ‌ట్టు టీ20 సిరీస్‌ను గెలుచుకుంది, కానీ వ‌న్డే సిరీస్‌లో ఓడిపోయింది. ప్రస్తుతం, గౌతీ తన తదుపరి సవాళ్లకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబ‌ర్ 19 నుండి, భార‌త జ‌ట్టు బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్‌ను ఆడనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లు ఉన్నాయి. ప్ర‌పంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరాలంటే, ఈ సిరీస్‌లలో భార‌త జ‌ట్టు విజయం సాధించడం చాలా ముఖ్యం. శ్రీలంక ప‌ర్యటన అనంతరం గౌతీకి కొంత విశ్రాంతి లభించడంతో, ప్రస్తుతం అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు.

వివరాలు 

వన్‌డౌన్‌లో రాహుల్ ద్రవిడ్‌

ఈ క్ర‌మంలో స్పోర్ట్స్ కీడా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో, గంభీర్ భార‌త జ‌ట్టు ఆల్‌టైమ్ ఎలెవ‌న్‌ను ఎంచుకున్నాడు. ఈ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జ‌స్ప్రీత్ బుమ్రాకు చోటు దక్కలేదు. గంభీర్ తన జట్టుకు ధోనిని కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్,సెహ్వాగ్,యువరాజ్ వంటి ఇతర దిగ్గజాలకు చోటు ఇచ్చాడు. ఓపెనర్లుగా త‌న‌తో పాటు వీరేంద్ర సెహ్వాగ్‌ను ఎంచుకున్నాడు. వన్‌డౌన్‌లో రాహుల్ ద్రవిడ్‌ను తీసుకున్నాడు. నాలుగో స్థానంలో సచిన్ టెండూల్కర్‌ను ఎంచుకున్నాడు. ఆ త‌రువాత విరాట్ కోహ్లీ,యువరాజ్ సింగ్‌లను ఐదు, ఆరు స్థానాల్లో తీసుకున్నాడు. వికెట్ కీప‌ర్‌గా ధోనిని ఎంపిక చేసాడు. ఫాస్ట్ బౌలింగ్ జాబితాలో జహీర్ ఖాన్,ఇర్ఫాన్ పఠాన్‌లను, స్పిన్ విభాగంలో అనిల్ కుంబ్లే,రవిచంద్రన్ అశ్విన్‌లను చోటు కల్పించాడు.

Details 

గంభీర్ ఆల్‌టైమ్ ఎలెవ‌న్..

వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, ఎంఎస్‌ ధోని (కెప్టెన్‌/ వికెట్‌ కీపర్‌), అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్.