
Asia Cup 2023 : ఆసియా కప్ కోసం శ్రీలంకకు చేరుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంక, పాకిస్థాన్ వేదికగా జరగనున్న ఆసియా కప్ టోర్నీ ఆడేందుకు భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శ్రీలంకకు చేరుకున్నారు. వారితో పాటు భారత ఆటగాళ్లు కూడా లంక గడ్డపై అడుగుపెట్టారు.
బుధవారం ఉదయం భారత జట్టు ప్లేయర్లు కొలంబో ఎయిర్ పోర్టులో దిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టు ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), కోహ్లీ, శ్రేయష్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, షమీ, సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, సామ్సన్ (బ్యాకప్)
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కొలంబో ఎయిర్ పోర్టులో దిగిన భారత్ ఆటగాళ్లు
Team India arrived in Colombo for the #Asiacup @BCCI @imVkohli pic.twitter.com/bDSdebu3mu
— vipul kashyap (@kashyapvipul) August 30, 2023